‘బ్రో’ కలెక్షన్ల గురించిన న్యూస్ కూడా మీడియా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, పవన్ కెరీర్‌లో ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ.. రూ. 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ మానియా కనిపించింది. మామూలు ధరలతోనే భారీ వసూళ్లు సాధించడం పవన్‌కే సాధ్యం అని మరోసారి నిరూపించిందీ చిత్రం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఏరియాల వారీగా ‘బ్రో’ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే (హైర్స్, జీఎస్టీ) కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.