ఓ వైపు ‘బ్రో’ టికెట్స్ కోసం నానా హంగామా నడుస్తుంది. మరోవైపు రివ్యూల కోసం సెర్చింగ్ కూడా. ఇలాంటి హడావిడి టైంలో ఓటీటీ రిలీజ్ గురించిన న్యూస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మూవీతో తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల వర్షం పడుతున్నప్పటికీ హాళ్ల దగ్గర జనప్రభంజనం కనిపిస్తోంది. ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ మూవీకి ఏపీ, తెలంగాణలో హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. ఇన్నాళ్లూ ఫ్యాన్స్, ఆడియన్స్ పవన్ నుండి మిస్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్, స్టైల్, స్వాగ్, వింటేజ్ లుక్స్.. అలాగే పవర్ స్టార్ ఓల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అన్నీ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా పనులు పక్కన పెట్టేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి మల్టీప్లెక్సుల బాట పట్టారు.
అయితే పవన్ లాంటి స్టార్ హీరో మూవీ సింగిల్ స్క్రీన్‌లో చూస్తే ఆ కిక్కే వేరు. అభిమానుల కోలాహలం మధ్య, క్లాప్స్, విజిల్స్ వంటి ఆ హంగామా మధ్య సినిమా అర్థం కాకపోయినా కానీ ఆ అనుభూతి వేరేలా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, లిటిల్ పవర్ స్టార్ అకీరా నందన్ తండ్రి సినిమా చూడ్డానికి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని మెయిన్ థియేటర్ సుదర్శన్ 35MMకి వచ్చాడు. అది కూడా ‘బ్రో’ లో పవన్ వేసుకున్న హుడీతో ఓ కల్ట్ ఫ్యాన్‌లా వచ్చాడు. తండ్రి సినిమా చూడ్డానికి అకీరా వచ్చిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : ‘బ్రో’ సినిమా రివ్యూ!
ఓ వైపు ‘బ్రో’ టికెట్స్ కోసం నానా హంగామా నడుస్తుంది. మరోవైపు రివ్యూల కోసం సెర్చింగ్ కూడా. ఇలాంటి హడావిడి టైంలో ఓటీటీ రిలీజ్ గురించిన న్యూస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సినిమా ప్రారంభంలో డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఎవరనేది రివీల్ చేస్తారు కాబట్టి అందులో ఎలాంటి సస్పెన్స్ ఉండదు. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ ఉండదు. ఈ మధ్య ‘స్పై’ లాంటి కొన్ని సినిమాలు చడీ చప్పుడు లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.
ఇక ‘బ్రో’ విషయానికొస్తే.. మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన థియేటర్లలో విడుదలైన 5 వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శాటిలైట్ రైట్స్ జీ తెలుగు భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఇది కూడా చదవండి : ‘బ్రో’ థియేటర్‌లో అకీరా.. తండ్రిని మించిన క్రేజ్!