పవర్ స్టార్ ఫ్యాన్స్, ప్రేక్షకుల మాదిరిగానే సినీ పరిశ్రమలోనూ ఫస్ట్‌డే మార్నింగ్ షో చూడ్డానికి ఆసక్తి చూపించేవారు ఎక్కువ మందే ఉంటారు. మల్టీప్లెక్స్‌లన్నీ సెలబ్రిటీలతో సందడిగా మారిపోయాయి. అయితే పవన్ లాంటి స్టార్ హీరో మూవీ సింగిల్ స్క్రీన్‌లో చూస్తే ఆ కిక్కే వేరు.
తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల వర్షం పడుతున్నప్పటికీ హాళ్ల దగ్గర జనప్రభంజనం కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన మూవీ.. ‘బ్రో’ (ది అవతార్). పి.సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. జీ5 సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘బ్రో’ మూవీకి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్, సినీ వర్గాల వారి నుండి హిట్ టాక్ వస్తోంది.
పవర్ స్టార్ ఫ్యాన్స్, ప్రేక్షకుల మాదిరిగానే సినీ పరిశ్రమలోనూ ఫస్ట్‌డే మార్నింగ్ షో చూడ్డానికి ఆసక్తి చూపించేవారు ఎక్కువ మందే ఉంటారు. మల్టీప్లెక్స్‌లన్నీ సెలబ్రిటీలతో సందడిగా మారిపోయాయి. అయితే పవన్ లాంటి స్టార్ హీరో మూవీ సింగిల్ స్క్రీన్‌లో చూస్తే ఆ కిక్కే వేరు. అభిమానుల కోలాహలం మధ్య, క్లాప్స్, విజిల్స్ వంటి ఆ హంగామా మధ్య సినిమా అర్థం కాకపోయినా కానీ ఆ అనుభూతి వేరేలా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, లిటిల్ పవర్ స్టార్ అకీరా నందన్ తండ్రి సినిమా చూడ్డానికి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని మెయిన్ థియేటర్ సుదర్శన్ 35MMకి వచ్చాడు. అది కూడా ‘బ్రో’ లో పవన్ వేసుకున్న హుడీతో ఓ కల్ట్ ఫ్యాన్‌లా వచ్చాడు.
అకీరాను చూడగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందంతో పవర్ స్టార్ నినాదాలు చేశారు. ‘బాబులకే బాబు కళ్యాణ్ బాబు’ అంటూ పెద్ద ఎత్తున గోల గోల చేశారు. దీంతో అకీరాను థియేటర్‌లో నుండి కార్ వరకు తీసుకెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది చాలా కష్టపడ్డారు. తండ్రి సినిమా చూడ్డానికి అకీరా వచ్చిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ చూసిన వారంతా ‘బ్రో’ కి పవన్ మెయిన్ పిల్లర్, ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ అని.. యాక్టింగ్, స్టైల్, స్వాగ్, ఎనర్జీ, వింటేజ్ లుక్స్, కామెడీ టైమింగ్‌తో రఫ్ఫాడించేశాడని చెప్తున్నారు.