చిన్న మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తేజ్, ఆరు నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా చిల్ అవుతున్నాడు. అయితే తేజ్ పక్కన ఉన్న కుర్రాడు హైలెట్ అయ్యాడు.
సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ పిక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇటీవల చిన్న మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తేజ్, ఆరు నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా చిల్ అవుతున్నాడు. అయితే తేజ్ పక్కన ఉన్న కుర్రాడు హైలెట్ అయ్యాడు. గుర్తు పట్టలేకుండా తయారైన అతగాడిని చూసి ఇలా మారిపోయాడేంటి? అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ తనెవరో తెలుసా.. సీనియర్ నటడు వీకే నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ.
హీరోగా ‘నందిని నర్సింగ్ హోమ్’, ‘ఊరంతా అనుకుంటున్నారు’, ‘ఐనా ఇష్టం నువ్వే’ వంటి సినిమాలు చేశాడు. పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సైలెంట్ అయిపోయాడు. అయితే టెక్నీషియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎడిటింగ్‌తో పలు విభాగాల మీద మంచి గ్రిప్ ఉంది. ‘అత్తారింటికి దారేది’ మూవీకి నవీన్ ట్రైలర్ కట్ చేశాడని త్రివిక్రమ్ గతంలో ఓ ఫంక్షన్‌లో చెప్పారు. సాయి ధరమ్ తేజ్ – నవీన్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా కలుస్తుంటారు. తేజ్‌కి యాక్సిడెంట్ జరిగే ముందు కూడా నవీన్ ఇంటి నుంచే బయలు దేరాడు. నవీన్ ఇప్పుడు తనలోని దర్శకుడిని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు.
తేజ్, కలర్స్ స్వాతి హీరో హీరోయిన్లుగా ‘సత్య’ అనే షార్ట్ ఫిలిం తీశాడు నవీన్. త్వరలో రిలీజ్ కానుంది. ఆర్మీ జవాన్ ప్రేమకథగా తెరకెక్కినట్లు సమాచారం. ఇక రీసెంట్‌గా తేజ్‌ని కలిసినప్పుడు నవీన్ చాలా లావుగా కనిపించాడు. హీరోగా చెయ్యట్లేదు కాబట్టి ఫిజిక్ మీద ఫోకస్ పెట్టడం లేదేమో కానీ గమనిస్తే కానీ పోల్చుకోలేని విధంగా తయారయ్యాడు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. హెల్త్ ఇష్యూస్ వల్ల కాస్త బ్రేక్ తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి : బేబి హీరోయిన్‌పై ఇంత అనురాగం చూపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా?