వాలంటైన్స్ డే రోజున ప్రముఖ నటి అదితీ రావ్ హైదరీ షాక్ ఇచ్చింది. నటుడు సిద్ధార్థతో ఇన్ని రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు అతడికే షాక్ నిచ్చింది. తన మనసులో ఉన్న వ్యక్తి గురించి చెప్పడమే కాకుండా.. అతడికి ప్రపోజ్ కూడా చేసింది.
వాలంటైన్స్ డే రోజున ప్రేమ పక్షులన్నీ ఓ చోట చేరిపోతాయి. తమకు ఇష్టమైన వారికి ప్రపోజల్స్ చేయడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తాయి. ప్రముఖులు సైతం దీనికేమీ అతీతం కాదు. ఈ ప్రేమికుల రోజునే ప్రముఖ నటి తన మనసులోని వ్యక్తిని బటయపెట్టింది. ఆమె ఎవరో కాదూ హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితీరావ్ హైదరీ. నటుడు సిద్ధార్థ్ అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. సిద్దార్థ్ షాక్ గురిచేస్తూ.. తనకు ఇష్టమైన వ్యక్తికి గులాబీ పువ్వు ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. అతడి ఫోటోను షేర్ చేసిన ఈ భామ.. అతడెవరో గెస్ చేయండి అంటూ నెటిజన్లకే సవాలు విసిరింది.
హీరో సిద్ధార్థ్, అదితీరావ్ హైదరీ గత కొతకాలంగా ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి విదితమే. శర్వానంద్, సిద్దార్థ్ కాంబోలో వచ్చిన మహా సముద్రం షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. పలుమార్లు బయట కనిపిస్తూ ఈ వార్తలకు ఆజ్యం పోశారు. ఇటీవల శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు కూడా జంటగా రావడంతో వీరిద్దరూ సహజీవనంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఓ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారన్న రూమర్ కూడా వచ్చింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు నడిచాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఇరువురు స్పందించలేదు.
వాలంటైన్స్ డే పురస్కరించుకుని సిద్ధార్థ్‌కి షాక్‌నిస్తూ తన మనసులో ఉన్న వ్యక్తిని పరిచయం చేయడంతో పాటు తన లవ్ ను వ్యక్త పరిచారు అదితి. ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా, మరోవరో కాదండి సీనియర్ నటుడు ధర్మేంద్ర. ఆయనకు గులాబినందించిన వీడియోను తన ఇన్ స్టా స్టేటస్ లో పెట్టిన అదితీ.. గెస్ అంటూ ప్రశ్నించింది. అదేవిధంగా అతడితో దిగిన ఫోటోను కూడా షేర్ చేసుకుంటూ మోస్టెస్ట్ హ్యాండ్సమ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లంతా నవ్వుకుంటున్నారు. ఈ ఫోటోకు సైతం సిద్ధార్థ్ రెండు లవ్ ఎమేజీలను జత చేశారు. దీనిపై కొన్ని కామెంట్లు వస్తున్నాయి. సిద్ధార్థ్ ను ఎందుకు మోసం చేశావ్, ప్రేమికుల రోజే ప్రియుడికి పెద్ద షాక్ ఇచ్చావుగా అంటూ సదరగా సెటైర్లు వేస్తున్నారు. కాగా, ఈ ఫోటోలో ఎప్పుడో షూటింగ్ సమయంలో తీసుకున్నదీగా పలువురు భావిస్తున్నారు. అదితీ రావ్ హైదరీ సినిమాల్లో మీకు ఏదీ నచ్చిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.