నవ్వించడం యోగం, నవ్వడం భోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారు జంధ్యాల. ఈ మాట అక్షర సత్యం. కానీ.., తెరపై నవ్వులు కురిపించే ఆర్టిస్ట్ ల జీవితాలు మనం అనుకున్నంత అందంగా ఉండవు. వారికీ కష్టాలు ఉంటాయి. వారికీ బాధలు ఉంటాయి. వారికీ ఎమోషన్స్ ఉంటాయి. తాజాగా జబర్దస్త్ నటుడు అదిరే అభి చెప్పిన మాటలు వింటే ఈ విషయం అర్ధం అవుతుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ నటుడిగా అభి అందరికి పరిచయమే. కెరీర్ పరంగా ఇబ్బంది లేకుండా సాగిపోతున్న అభి.. తాజాగా సుమ క్యాష్ పోగ్రామ్ లో తన సిస్టర్ తో కలసి పార్టిసిపేట్ చేశాడు. ఈ వేదికపై నుండి అభి జీవితంలో తనకి ఎదురైన విషమ పరిస్థితి గురించి ఓపెన్ అయ్యాడు.
ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. నాకు కరోనా సోకింది. అప్పుడు చనిపోతానని భయంతో తలుపులు కూడా గొళ్లెం పెట్టకుండా పడుకునేవాడిని. తర్వాత ఏదైనా జరిగితే నన్ను చూడటం కుదరదని అలా చేసేవాడిని. అప్పుడు భయంతో నాన్న వాళ్లను చుట్టాలింటికి పంపేశాను. అప్పుడు నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. సరిగ్గా ఆ సమయంలో నా పరిస్థితి నా సిస్టర్ కి తెలిసింది. వెంటనే ఆమె దుబాయ్ నుండి ఇండియాకి వచ్చేసింది. ఆ కష్ట కాలంలో నాకు అండగా నిలబడింది. ఈరోజు తాను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం తన సిస్టరే అని అభి ఎమోషనల్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో.., అక్కడే ఉన్న అభి సిస్టర్ కూడా కన్నీరు పెట్టేసుకుంది.
ఇక నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా అభికి చాలా మంచి పేరు ఉంది. సుదీర్ఘమైన కెరీర్‌లో అదిరే అభి ఎంతో మంది ఆర్టిస్టులను జబర్ధస్త్ షోలోకి తీసుకొచ్చాడు. వాళ్ల టాలెంట్‌ను పది మందికి చూపించుకునే అవకాశం ఇచ్చాడు. అలా వచ్చిన వారిలో ఇప్పటి టీమ్ లీడర్ హైపర్ ఆది కూడా ఒకడు. అతడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అభినే అని ఎన్నో సార్లు చెప్పాడు. అతడితో పాటు నవీన్, రాము సహా పలువురు జబర్ధస్త్‌లో కొనసాగుతున్నారు.