సినిమా వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. సినిమా కూడా జూదం లాంటిదే. ఒకరోజు బాగా డబ్బులు వస్తే.. ఆ మరుసటి రోజు మొత్తం వచ్చిన డబ్బులన్నీ పోతాయి. సినిమా జీవితాలు కూడా ఇలానే ఉంటాయి. సూపర్ హిట్లు కొట్టినప్పుడు వచ్చిన డబ్బుతో లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తారు. విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు అంటూ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటారు. తీరా చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే.. ఇక అవకాశాలే రావు. ఒకసారి ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిందంటే.. ఇక అది చెరుపుకోవడం చాలా కష్టమవుతుంది. దీంతో సినిమాలు ఉండవు, పారితోషికం రాదు.. ఇటు చూస్తే మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతుంటాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఓ హీరోయిన్ కి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ 8 ఏళ్ల క్రితం.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ని కొనుగోలు చేసింది. 2015 జూన్ నెలలో రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు దీన్ని రూ. 32.50 కోట్లకు ఢిల్లీ బేస్డ్ కంపెనీ అయిన ఎస్ఎంఎఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత వారం డిసెంబర్ 29న అమ్మేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రూ. 1.95 కోట్ల రూపాయలతో స్టాంప్ డ్యూటీ కూడా జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ముంబై పోష్ ఏరియాలో ఉన్న ఈ ఫ్లాట్ 5,533 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో ఉంది.
తూర్పు బాంద్రాలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జి బ్లాక్ లో మూడవ అంతస్తు మీద సిగ్నేచర్ ఐలాండ్ మీద ఉంది. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతోంది. సవారియా, నీర్జా సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత నుంచి ఆమెకు ఆశించినంతగా సక్సెస్ రాలేదు. ఏక్ లడ్కి కో దేఖా తొహ్ ఐసా లగా, ది జోయా ఫ్యాక్టర్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. ఏకే వర్సెస్ ఏకే సినిమాలో క్యామియో పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన బ్లైండ్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. వరుస సినిమా ఆఫర్లు తగ్గిపోవడంతోనే ఆమె ముంబైలో ఉన్న తన విలాసవంతమైన ఫ్లాట్ ని అమ్ముకుందని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.