సినిమా వాళ్ల జీవితాలు.. సాధారణ మనుషులతో పోల్చుకుంటే కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. ప్రేమలు, పెళ్లిళ్లు, ఇతర సంబంధాల విషయంలో సాధారణ జనం కంటే వారికి కొంత స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని సార్లు ఈ స్వేచ్ఛ వారిని చాలా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. సెలెబ్రిటీ జంటలు ప్రేమలోకి కానీ, పెళ్లి బంధంలోకి కానీ, అడుగుపెడితే.. చాలా కొంతమంది మాత్రమే జీవితాంతం కలిసి ఉంటున్నారు. నూటికి 60 శాతం మంది విడిపోతున్నారు. అయితే, ఒకరికి విడిపోవటం ఇష్టం ఉండి.. మరొకరికి ఇష్టం లేకపోతే అది వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ పరిస్థితి కూడా అలానే ఉంది.
ఆమె ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెకు దూరం అయ్యాడు. దీన్ని రాఖీ సావంత్ తట్టుకోలేకపోతోంది. తాను మతం మారి మరీ పెళ్లి చేసుకున్న ఆదిల్ వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె ఆరోపిస్తోంది. తాజాగా, మీడియా ముందు తన భర్తతో ఎఫైర్ పెట్టుకున్న ఆమెకు మాస్ మార్నింగ్ ఇచ్చింది. ఆ వీడియోలో.. ‘‘ నా కంట్లోంచి రాలుతున్న ప్రతీ కంటి చుక్క ప్రతీకారం నా దేవుడు పరమేశ్వరుడు తీర్చుకుంటాడు. నేను తలిదించుకుని మౌనంగా ఉంటా.. అదే విధంగా నా స్వాభిమానం, నా భర్త కోసం తల పైకెత్తి పోరాటం కూడా చేస్తాను. మీడియా ముందు ఆ మహిళకు వార్నింగ్ ఇస్తున్నాను.
పెళ్లయిన మా భార్యాభర్తల మధ్యలోకి వస్తే.. సిగ్గుండాలి. ఓ మహిళ మరో మహిళ జీవితాన్ని నాశనం చేస్తుందా?.. మనిషంటేనే ఓ కుక్క.. నువ్వు పెళ్లయిన ఇళ్లాలి జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నావా? సంతోషించు.. నేను నీ పేరు చెప్పటం లేదు. ఆదిల్ నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నా.. ఆమెను వదిలిపెట్టి ఇంటికి వచ్చేయ్.. వేరే మహిళల్లాగా నేను గమ్మున ఉండను. ఎలాంటి కానుక ఇచ్చావు నాకు’’ అంటూ ఆవేదన వ్కక్తం చేసింది’’ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.