చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆమె. చాలా తక్కువ టైమ్ లోనే ప్రపంచ స్థాయి మోడల్ గా మంచి గుర్తింపు సైతం తెచ్చుకుంది. అదీ కాక 2009లో మిస్ హైదరాబాద్ పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. ఆ మరుసటి సంవత్సరమే మిస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. అదీకాక తెలుగు బిగ్ బాస్ లో సైతం మెరిసింది ఈ భామ. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన జీవితంలో చేదు అనుభవాలను పంచుకుంది. ఒకానొవ దశలో సినిమాలు ఫ్లాఫ్ అవ్వడంతో టెర్రస్ పై నుంచి దూకి చనిపోదామనుకున్నట్లు చెప్పుకొచ్చింది.
సాధారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీ, నటులకు కాస్త గుండె ధైర్యం ఎక్కువగానే ఉంటుంది. అలా ధైర్యం లేకపోతే ఇండస్ట్రీలో ఎదుర్కొనే కష్టనష్టాలకు సుసైడ్ లు చేసుకుంటారు. అలాంటి ఘటనలను మనం పరిశ్రమలో చాలానే చూశాం. నా సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అవ్వడంతో నేను టెర్రస్ పై నుంచి దూకి చనిపోదామనుకున్నాను అని ప్రముఖ నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. వివరాల్లోకి వెళితే.. నందిని రాయ్.. మోడల్ గా కెరీర్ ప్రారంభించి తక్కువ కాలంలోనే వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడుకు వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి.
ఇక నందిని రాయ్ 2011లో వచ్చిన ‘040’ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత మాయ. ఖుషీ ఖుషీగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ లాంటి చిత్రాల్లో మెరిసింది. ఈ క్రమంలోనే బుల్లితెర స్టార్ షో బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే కెరీస్ స్టార్టింగ్ లో తన సినిమాలు సరిగ్గా ఆడలేదని, దాంతో తీవ్రంగా కుంగిపోయానని చెప్పుకొచ్చింది నందిని రాయ్. ఆ టైమ్ లో నేను టెర్రస్ పై నుంచి దూకి చనిపోదామనుకున్నా అని నందిని రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తర్వాత తన ఆలోచన తప్పని గ్రహించింది.
ఇక అప్పటి నుంచిస్నేహితులతో మాట్లాడుతూ.. ధైర్యం తెచ్చుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సైకాలాజికల్ కౌన్సిలింగ్ సైతం నందిని రాయ్ తీసుకున్నట్లు పేర్కొంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయని, వాటిని అధిమించి సంతోషంగా జీవించడమే లైఫ్ అంటే అని అర్థం చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం తెలుగు తో పాటుగా పలు భాషల్లో చిత్రాలు చేస్తూ.. బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా నందిని రాయ్ నటించిన ‘పంచతంత్ర కథలు’, ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ లు ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ ల్లో నందిని రాయ్ నటిస్తోంది.