హీరోయిన్ మీనా పెళ్ళికి ముందు ఒక హీరోని బాగా ప్రేమించిందట. ఆ హీరోకి పెళ్లి అని తెలిసినప్పుడు చాలా బాధపడిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకే ఎవరా హీరో?
హీరోలకే కాదు.. హీరోయిన్లకు కూడా తోటి హీరోల విషయంలో క్రష్ ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు.. హీరోలను ప్రేమించి పెళ్లి అయ్యాక బాధపడ్డ వారు ఉన్నారు. హీరోలను ప్రేమించి పెళ్లి అయ్యిందని తెలిసి బాధపడ్డ హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన హీరోయిన్స్ ఉన్నారు. వీరిలానే నటి మీనా కూడా ఒక హీరోని ప్రేమించిందట. ఆ హీరోకి పెళ్లి అని తెలిసి ఆల్మోస్ట్ గుండె బద్దలయినంత పని అయ్యిందట. కానీ ఆ తర్వాత తన మనసుకి సర్దిచెప్పుకొని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. 20కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. నవయుగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా.. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన మీనా.. 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. అయితే గత ఏడాది జూన్ లో ఈమె భర్త మృతి చెందాడు. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది మీనా. బాధను మర్చిపోవడం కోసం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఓ తమిళ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పెళ్ళికి ముందు తనకు ఒక హీరో అంటే క్రష్ ఉండేదని.. అతన్ని విపరీతంగా ప్రేమించానని, ఆ హీరోని పెళ్లి చేసుకుంటానని ఆమె అమ్మతో కూడా చెప్పిందట. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. పెళ్ళికి ముందు హృతిక్ రోషన్ ను చాలా ప్రేమించానని, తనకు హృతిక్ రోషన్ లాంటి వ్యక్తి భర్తగా కావాలని అమ్మతో చెప్పానని మీనా అన్నారు. అయితే హృతిక్ రోషన్ కి 2000వ సంవత్సరంలో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి వార్త విన్న తనకు గుండె పగిలినంత పని అయ్యిందని.. అప్పటికి తనకు ఇంకా పెళ్లి కాలేదని మీనా వెల్లడించింది. హృతిక్ రోషన్ పై మనసు పారేసుకున్న మీనాపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.