ఇండస్ట్రీలో స్టార్డమ్ ని చూసిన నటీనటులు.. కెరీర్ లో ఫేస్ చేసిన గుడ్, బ్యాడ్ ఇలా అన్ని విషయాలను ఏదొక టైంలో షేర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్.. చాలామంది హీరోల సరసన వర్క్ చేస్తారు. కాబట్టి.. ఆయా హీరోలతో వర్క్ చేసినప్పుడు మర్చిపోలేని జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి. ఈ క్రమంలో నటి లయ.. టాలీవుడ్ లో అందరు హీరోల గురించి మాట్లాడి.. బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.
సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ ని చూసిన నటీనటులు.. కెరీర్ లో ఫేస్ చేసిన గుడ్, బ్యాడ్ ఇలా అన్ని విషయాలను ఏదొక టైంలో షేర్ చేసుకుంటుంటారు. అది ఇంటర్వ్యూలో అవ్వచ్చు లేదా సోషల్ మీడియాలో కూడా కావచ్చు. ముఖ్యంగా హీరోయిన్స్.. చాలామంది హీరోల సరసన వర్క్ చేస్తారు. కాబట్టి.. ఆయా హీరోలతో వర్క్ చేసినప్పుడు మర్చిపోలేని జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి. అవన్నీ ఎప్పుడో సమయం వచ్చినప్పుడు గానీ.. బయట పెట్టలేరు. తెలుగు ప్రేక్షకులకు నటి లయ గురించి తెలిసిందే. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన లయ.. తెలుగులో చాలామంది హీరోల సరసన నటించింది. నటసింహం బాలకృష్ణతో ‘విజయేంద్ర వర్మ’ అనే సినిమా చేసింది.
ఈ క్రమంలో చాలాయేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన లయ.. సుమన్ టీవీతో ఇంటర్వ్యూలో పాల్గొంది. టాలీవుడ్ లో అందరు హీరోల గురించి మాట్లాడి.. బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. లయ మాట్లాడుతూ.. ‘నాకు బాలయ్యతో సినిమా సెట్ అయినప్పుడు ఫస్ట్ సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్ కోసం నేను స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. అదే టైంలో బాలయ్య వెనక నిలబడి ఉండేసరికి చూసుకోకుండా ఆయన కాలు తొక్కేశాను. నేను వెంటనే సారీ సర్ అనేలోపు.. ఏంటి నా కాలు తొక్కేస్తావా? అని ప్యాకప్ అనేశారు. ఆయన అలా అనేసరికి.. వెంటనే నా వల్ల షూటింగ్ ఆగిపోయిందని బాధతో ఏడ్చేశాను. కాసేపటి తర్వాత ఆయన దగ్గరికి వచ్చి.. ఊరికే అన్నాను అని నవ్వేశారు’ అని చెప్పింది.
అంతేగాక బాలయ్యతో ఆన్ స్క్రీన్ మాత్రమే ఆఫ్ స్క్రీన్ లో ఆయన ఎలా ఉంటారో చెబుతూ.. తన జ్ఞాపకాలు షేర్ చేసుకుంది లయ. ప్రస్తుతం బాలయ్య గురించి లయ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే(2006) పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన లయ.. ఆ తర్వాత దాదాపు 12 ఏళ్ళకు రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో రీఎంట్రీ చేసింది. కానీ.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ ఫ్యామిలీకే పరిమితమైంది. ఇక హీరోయిన్ గా అలరించిన లయ.. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. మరి నటి లయ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.