పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో. ఓవైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్నారు. జనసేనానిగా 9 ఏళ్ళ నుండి ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పవన్ గురించి నటి లయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో. ఓవైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్నారు. సినీ హీరోగా పవన్ క్రేజ్ గురించి తెలిసిందే. కానీ.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాలలో పవన్ రేంజ్ మరోస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. జనసేనానిగా 9 ఏళ్ళ నుండి ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదీగాక ఈసారి 2024 ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ సీఎంగా చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని ఎంతోమందికి నమ్మకం కలిగించాడు. గెలిచినా ఓడినా ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడతానని చెబుతూ వస్తున్నారు పవన్.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందని.. ఆయన్ని ఆ సీట్ లో చూడాలని కోరుకునే ఫ్యాన్స్, ఫాలోయర్స్ కోట్లలో ఉన్నారు. అలా పవన్ ని సీఎంగా చూడాలని కోరుకునే వారిలో ఫ్యాన్స్ మాత్రమే కాదు. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఇప్పటిదాకా ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలు పవన్ సీఎం అయితే బాగుంటుందని.. సపోర్ట్ కూడా చేస్తామని చెప్పినవారూ ఉన్నారు. ఇప్పుడదే బాటలో నటి లయ చేరింది. హీరోయిన్ గా లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్వయంవరం, ప్రేమించు, మనోహరం, మా బాలాజీ, మిస్సమ్మ, స్వరాభిషేకం లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
అలా హీరోయిన్ గా కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడే డాక్టర్ గణేష్ గొర్తిని పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోయింది. అప్పటినుండి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్న లయ.. ఆ తర్వాత 12 ఏళ్ళకు అమర్ అక్బర్ ఆంటోని మూవీతో నటిగా రీఎంట్రీ చేసింది. కానీ.. ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో మళ్లీ పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోయింది. కాగా.. తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ.. ‘పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా?’ అనే విషయంపై వినూత్నంగా రియాక్ట్ అయ్యింది. లయ మాట్లాడుతూ.. “నాకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు. కానీ.. పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే కరిష్మా ఉంది. ఆయన అవుతారా లేదా అనేది జనాలు డిసైడ్ చేస్తారు. ఆయన సీఎం అయితే మాత్రం సీఎం సీట్ కి ఆ ఆరా వస్తుంది. ఆయనెప్పుడూ ఫ్యాన్స్ కి, మా లాంటి ఆర్టిస్ట్ లకి ఎప్పుడూ టాప్ లోనే ఉంటారు” అని చెప్పింది. ప్రస్తుతం పవన్ గురించి లయ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నటి లయ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.