తొలితరం బాల నట్లుల్లో ఒకరూ నటి కుట్టి పద్మిని. చిన్నతనం నుండే సినిమాను కెరీర్ గా మలుచుకున్న వారిలో ఆమె ముందు వరుసలో ఉంటారు. అప్పట్లో బాల నటి అంటే కుట్టి పద్మినినే తొలి ఆప్షన్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో బాల నటిగా మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అప్పట్లో ఆమె చాలా బిజీగా ఉండేవారు. ఆమె తల్లి రాధాబాయి కూడా పాత తరం నటి. నటి సావిత్రికి రాధ స్నేహితురాలు. దీంతో ఆమెను ఓ సారి షూటింగ్ తీసుకెళ్లగా.. అనుకోకుండా బాలనటిగా మారిపోయారు. 1959లో మూడేళ్ల ప్రాయంలోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ఇప్పటికీ అందులోనే కొనసాగుతున్నారు. 1965లో జమున, జైశంకర్ కలిసిన నటించిన కుళందయుం దైవముం (తెలుగులో లేత మనసులు)లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకుగానూ ఆమెకు జాతీయ అవార్డు దక్కింది.
ఆ తర్వాత తెలుగు, తమిళంలోని టాప్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు కుట్టి పద్మిని. అదపా దడపా సినిమాల్లో హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ప్రస్తుతం సీరియల్స్ నిర్మాతగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్ గా కెరీర్ కొనసాగించపోవడంపై ఆమె స్పందిస్తూ..తనకు 16 ఏళ్లు వచ్చేనాటికి సావిత్రి, జమునల హయాం మారిపోయాక.. కొంత మంది దర్శకులు అడ్డస్ట్ మెంట్లు అడగడం మొదలు పెట్టారని, అంతేకాకుండా చిన్న చిన్నదుస్తులు, గ్లామర్ డ్రస్‌లు ధరించడం ఇష్టం లేక హీరోయిన్‌గా పలు సినిమాలు వదులుకున్నట్లు చెప్పారు. గతంలో వ్యాంప్ పాత్రలు వేసేవాళ్లే గ్లామర్ డ్రెస్ లు వేసేవాళ్లని, కానీ అప్పటికీ హీరోయిన్లే ఇటువంటి డ్రెస్లు వేస్తుండటంతో తనకు నచ్చక వదిలేసుకున్నానని అన్నారు. తన తరంలోని మరో బాల నటి శ్రీదేవి హీరోయిన్ గా విజయం సాధించిందన్నారు. తనకు ఆ అదృష్టం లేనప్పటికీ.. రోజుకు 140 మందికి శాలరీ ఇచ్చే స్థితిలో తనను దేవుడుంచాడని అన్నారు.
23 ఏళ్లగా నిర్మాతగా రాణిస్తున్నానని, రోజుకు 200 మందికి పని కల్పించి, జీతాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైతే తనకు వేషాలు లేవని, తనను కష్టపెట్టిన దర్శకులకు తన సీరియల్స్లో పని కల్పించానన్నారు. తనను అడ్జస్ట్ మెంట్ ఎవరైతే అడిగారో వారిలో ఇద్దరు డైరెక్టర్లుకు పిలిచి, తన సీరియల్స్ రూపొందించేందుకు అవకాశం ఇచ్చానని, వారి పిల్లల స్కూల్ ఫీజులు కట్టానని తెలిపారు. తనకు మ్యారేజ్ లైఫ్ అంత అచ్చి రాలేదన్నారు. తనకు రెండు పెళ్లిళ్లు జరిగాయని, మొదటి భర్త తాగుడుకు బానిసవ్వడంతో వేరు పడ్డామని చెప్పారు. తర్వాత ప్రభు అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నామని, మాకు ఇద్దరు పిల్లలన్నారు. అయితే 22 ఏళ్లు తనతో కాపురం చేశాక, రెండో భర్త తన సెక్రటరీని లవ్ చేశారని, అడ్జస్ట్ కావాలా లేదా ఒంటరిగా ఉండాలా అని ఆలోచించనన్నారు. చివరికీ సింగిల్ ఉండేందుకు నిర్ణయం తీసుకున్నానన్నారు.
తన భర్త ప్రభు, సెక్రటరీ వివాహం చేసుకున్నారన్నారు. వారు వేరే కాపురం ఉంటున్నారన్నారు. ఇప్పుడు తాను తన పిల్లల వద్దే ఉంటున్నానని చెప్పారు. తన మొదటి భర్త అనారోగ్యం బారిన పడ్డారని తెలిసి, ఆయనను మేమే తీసుకువచ్చి, మా ఆఫీసు కింద రూమ్ కట్టి, చూసుకున్నామన్నారు. ఆయనకు నెలకు రూ. 30 వేల జీతం కూడా ఇచ్చామన్నారు. ఆయన మాతో స్నేహితుడిగా ఉండేవారని, గత ఏడాదే అతడు కాలం చేశారని చెప్పారు. తప్పేనేది జరగుతుంటుందని, అతడు కష్టంలో ఉన్నాడని తెలిసి, సాయం చేయాలని భావించాలని అన్నారు. కుట్టి పద్మిని 1983 నుండి వైష్ణవి ఫిలింస్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ రూపొందిస్తూ నిర్మాతగా మారారు. చిన్న సమస్యకే బాధపడిపోయిన మనకు.. ఆమె జీవితం ఓ ఉదాహరణననే చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.