ప్రాణం విలువ అనేది చావును నుంచి తృటిలో తప్పించుకున్న వారికే తెలుస్తుంది. ఇలాంటి అనుభవాలు సామాన్యుల నుంచి ప్రముఖల వరకు చాలా మందికి ఫేజ్ చేసి ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు.. తాము తృటిలో తప్పించుకున్న ప్రమాదాల గురించి పలు సందర్భాల్లో షేర్ చేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ.. తన జీవితంలో జరిగిన ఓ ఘటన గురించి షేర్ చేసుకున్నారు. హారర్ కామెడీ ఎంటర్ టైనర్ భూల్ భులయ్యా-2 తో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఆసక్తికర విషాలు చెప్పుకొచ్చింది.
‘భూల్ భులయ్యా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ ‘భూల్ భులయ్యా-2’. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది కియరా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. దెయ్యాలంటే మీకు భయమా అని విలేకరి అడిగిన ప్రశ్నకు..” నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. రాత్రిపూట ఒక్కదాన్నే నిద్రపోతున్నప్పుడు భయపడతాను. అందుకే ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్లను” అని కియారా అన్నారు. అనంతరం తన జీవితంలో జరిగిన ఓ ఘటన వల్ల చావుని దగ్గర నుంచి చూశానంటూ ఆమె వ్యాఖ్యనించారు.
ఇదీ చదవండి: ప్రభాస్‌తోని అట్లుంటది.. ఏకంగా ఆరడుగులు కేక్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చాడు!
“కాలేజి రోజుల్లో స్నేహితులతో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాను. మంచు ఎక్కువగా కురవడంతో నాలుగు రోజుల పాటు మేము హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ లేదు. తాగటానికి మంచినీళ్లు దొరకలేదు. వేడి కోసం మంటను ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగో రోజు రాత్రి హోటల్ గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అకస్మాత్తుగా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి.
ఇదీ చదవండి: రామ్ చరణ్ మంచి మనసు.. డ్రైవర్‌కి మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చాడుగా!
అది చూసిన నా స్నేహితురాలు మా అందర్నీ నిద్రలేపింది. అప్పటికే రూమ్ అంత పొగ నిండిపోయింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది’ అని కియరా పేర్కొంది. మరి.. ఈ భామ షేర్ చేసుకున్న తన జీవిత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.