ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్ అంతా వయసు పైబడ్డాక సినిమాలలో తల్లి, అత్త లాంటి పాత్రలు చేస్తున్నారు. మరికొందరు సీరియల్స్ లో కంటిన్యూ అవుతున్నారు. ఎలాగైతేనేం తెరమీద కనిపిస్తే చాలని, ప్రేక్షకుల కంట్లో పడుతూ ట్రెండింగ్ లో ఉండాలని మరికొందరు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటున్నారు. వయసు గురించి ఆలోచించకుండా గ్లామర్ ప్రియలను, నాటీ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని గ్లామరస్ ఫోటోషూట్స్ తో కూడా మెప్పిస్తున్నారు.
సరే హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు అందాలను ప్రదర్శించారంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ సీరియల్స్ లో సాంప్రదాయబద్దంగా కనిపించే పాత్రలు చేస్తూ కూడా సోషల్ మీడియా విషయానికి వచ్చేసరికి గ్లామర్ పరంగా హద్దులు చెరిపేస్తున్నారు. అలాంటి నటీమణులలో గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి ఒకరు. కస్తూరి పేరు వినగానే అందరికీ ముందుగా అన్నమయ్య, భారతీయుడు సినిమాలు గుర్తొస్తాయేమో.. కానీ నెట్టింట కస్తూరికి మరో రూపం ఉంది.
50 ఏళ్ళు దగ్గరపడిన కస్తూరి ఊహించని రేంజిలో గ్లామర్ షో చేస్తూ ఫ్యాన్స్ ని, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీరియల్ లో చీరకట్టుకొని తెలుగింటి గృహలక్ష్మిలా కనిపించే కస్తూరి.. సోషల్ మీడియాలో చీర తప్ప అన్ని ట్రెండ్ లను ఫాలో అయిపోతుంది. డ్రెస్సింగ్ స్టైల్ మొదలుకొని టాప్ టు బాటమ్ కెమెరా ముందుంచుతుంది. తాజాగా కస్తూరి పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోళీసోడా చేతబట్టుకొని కస్తూరి పోస్ట్ చేసిన పిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరి కస్తూరి లేటెస్ట్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.