సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలంతా అటు ప్రేక్షకులతో, ఇటు అభిమానులతో టచ్ లో ఉండటం చూస్తున్నాం. రెగ్యులర్ గా తమ సినిమాలకు సంబంధించి లేదా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లను మించి సీరియల్ నటీమణులు, యాంకర్స్ సోషల్ మీడియాలో గ్లామర్ పోస్టులు పెట్టడంలో పోటీ పడుతున్నారు. అలాంటి గ్లామరస్ బ్యూటీలలో నటి కస్తూరి ఒకరు. కెరీర్ లో హీరోయిన్ గా ఎన్నో గ్లామరస్ రోల్స్ చేసిన కస్తూరి.. సినిమాలు తగ్గించేసి సీరియల్స్ వైపు వచ్చేసింది. తెలుగులో ‘ఇంటింటి గృహలక్ష్మి’ అనే సీరియల్ లో ప్రధానపాత్ర పోషిస్తుంది.
ఈ సీరియల్ ఇప్పుడు ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. సీరియల్ లో తల్లి క్యారెక్టర్ తో ఎంతో చక్కగా.. చీరకట్టులో మెప్పించే కస్తూరి.. పర్సనల్ లైఫ్ లో చాలా బోల్డ్ గా, తనకు నచ్చినట్లుగా జీవిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు తగ్గించేసి.. స్పెషల్ సాంగ్స్, సపోర్టింగ్ రోల్స్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. మరోవైపు చాలా ఏళ్లుగా సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కస్తూరి అప్పుడప్పుడు బోల్డ్ ఫోటోలు పెడుతుంటుంది. సోషల్ మీడియా అంటే తెలిసిందేగా.. బోల్డ్ గా ఏం పోస్టులు పెట్టినా కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్స్. ఈ క్రమంలో కస్తూరి తాజాగా స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న స్లో మోషన్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై పలువురు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజెన్ మాత్రం.. ‘ఈ వయసులో మీకు ఇవన్నీ అవసరమా?’ అని కామెంట్ చేశాడు. ఆ కామెంట్ పై స్పందించిన కస్తూరి.. “అవసరమే. ఈ వయసులో నీకు అవసరం లేదేమో. వెళ్లి రామాయణం చదువుకో పో’’ అని కౌంటర్ వేసింది. ప్రస్తుతం నెటిజన్ పై కస్తూరి వేసిన కౌంటర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం కస్తూరి వయసు 48 ఏళ్ళు. మరి వయసును గుర్తుచేస్తూ నెటిజెన్ చేసిన కామెంట్ కరెక్టా కాదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.