సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార కాంబినేషన్లో వచ్చి.. మంచి సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘చంద్రముఖి’. ఈ సినిమాను తమిళన దర్శకుడు వాసు తెరకెక్కించగా జ్యోతిక, ప్రభు, వడివేలు మొదలైన వాళ్లు కీలకపాత్రల్లో నటించారు. ఈసినిమా బాక్సాపీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపించింది. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. అయితే ప్రేక్షకులను ఎంతో అలరించిన ఈ సినిమాకు స్వీకెల్ గా చంద్రముఖి-2 తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో చందమామ కాజల్ అలరించనుంది.
ప్రముఖ వ్యాపార వేత గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ సినిమాలకు కొంత గ్యాప్ తీసుకుంది. ఇటీవల మగబిడ్డకు కూడా ఈ అమ్మడు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత చాలా కాలం పాటు గ్యాప్ ఇచ్చిన ఈ చందమామ..మళ్లీ వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. గత కొన్ని నెలలుగా షూటింగ్ లో పాల్గొని సౌత్ లో తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ గురించి మరో వార్త బయటకి వచ్చింది. సౌత్ ప్రేక్షకులను ఎంతో అలరించిన చంద్రముఖి కి స్వీకెల్ గా రాబోతున్న చంద్రముఖి-2 లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాను కూడా చంద్రముఖి దర్శకుడు వాసు తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో మొదలయ్యింది.
చంద్రముఖి-2 రజనీకాంత్ పాత్రలో ప్రముఖ డ్యాన్సర్ రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రను కాజల్ పోషించబోతుంది. గతంలో ఒప్పుకున్న కమల్ హాసన్ భారతీయుడు-2 సినిమాను పూర్తీ చేసే పనిలో కాజల్ పడింది. ఆ సినిమా తరువాత చంద్రముఖి-2 లోకేషన్ లోకి రానుందని సమాచారం. చంద్రముఖి-2 సినిమాలో హీరోయిన్లగా పలువురు పేర్లను దర్శకుడు పరిశీలించారు. చివరకు లారెన్స్ కి కాజల్ అయితే బాగుంటుందనే ఆలోచనతో ఆమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చందమామ బ్యూటీ కూడా కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పినట్లు తెలిసింది. కాజల్ కెరీర్ లో ఇదో బెస్ట్ మూవీగా నిలవబోతుందని చిత్ర యూనిట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. కాజల్.. చంద్రముఖి పాత్ర చూసేందుకు ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసున్నారు.