సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ ల మధ్య, డైరెక్టర్, హీరోయిన్ ల మధ్య.. అలాగే ఇతర నటీ నటుల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ లు, విడాకులు లాంటివి చాలా కామన్. ఇక ఎవరైన ఇద్దరు నటీ నటులు కలిసి బయట కనిపిస్తే చాలు వారిద్దరు ప్రేమించుకుంటున్నారని పుకార్లు.. షికారు చేస్తాయి. అయితే కొన్ని జంటల ప్రేమ వ్యవహారాలు నిజమే.. అయినప్పటికీ వారు కొన్ని నిజాలను దాస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన పెళ్లిపై తన తమ్ముడు ఇచ్చిన స్టేట్ మెంట్ పై స్పందించింది స్టార్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్. గత కొంత కాలంగా బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీ తో రకుల్ ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా తన పెళ్లిపై ట్వీటర్ వేదికగా స్పందించింది.
రకుల్ ప్రీత్ సింగ్.. సన్నజాజీ తీగలాంటి అందాలతో కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతోంది ఈ ఢిల్లీ భామ. కన్నడ సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయినప్పటికీ.. తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. ఇక తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన “వెంకటాద్రీ ఎక్స్ ప్రెస్” మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు వెనుదిరిగి చూసుకోలేదు. దాంతో వరుస అవకాశాలు రకుల్ తలుపు తట్టాయి. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్.. పండగ చేస్కో, లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, కొండ పొలం లాంటి పలు చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇటు గ్లామర్ తో.. అటు నటనతో తన కంటూ ఓ బ్రాండ్ ను క్రీయేట్ చేసుకుంది.
ఈ క్రమంలోనే తెలుగులో సినిమాలు తగ్గించి.. బాలీవుడ్ బాట పట్టింది ఈ ఢిల్లీ సోయగం. అక్కడ వరుసగా సినిమాలు తీస్తూ.. మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. వీరి ప్రేమ గురించి పరిశ్రమలో దాదాపు అందరికీ తెలుసు. కానీ ఇద్దరు ఎప్పుడూ ప్రేమ విషయం పై స్పందించలేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన రకుల్ తన పెళ్లిపై స్పందించింది. మరిన్ని విషయాల గురించి మాట్లాడుతూ..”చాలా మంది అభిమానులు తెలుగులో ఎప్పుడు నటిస్తారని నన్ను అడుగుతున్నారు. నాక్కూడా తెలుసు తెలుగులో నా చివరి మూవీ ‘కొండ పొలం’ అని. చాలా గ్యాప్ వచ్చింది.. త్వరలోనే టాలీవుడ్ లో నటిస్తాను. నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి తెలుగు సినీ పరిశ్రమే కారణం. మీకు.. మీ అభిమానానికి నేనెప్పుడూ రుణపడిఉంటా” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తన తమ్ముడు అమన్ ప్రీత్.. తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ.. త్వరలోనే జాకీ-రకుల్ పెళ్లి చేసుకుంటారు అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తన పెళ్లి వార్తలపై రకుల్ స్పందించింది. ట్వీటర్ వేదికగా..”అమన్ బ్రో నా వివాహం పై నువ్వు స్పష్టతనిచ్చావా? హో నా మ్యారేజ్ గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో..! ఇక నా లైఫ్ గురించి నాకే తెలియకపోవడం కామెడీగా ఉంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ‘ఛత్రివాలి’, ‘ఇండియన్-2’, ‘థ్యాంక్ గాడ్’, ‘డాక్టర్ జీ’ లాంటి పలు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.
😂 @AmanPreetOffl you confirmed ? Aur mujhe bataya bhi nahi bro .. it’s funny how I don’t have news about my life .. https://t.co/ZSZgNjW2BW
— Rakul Singh (@Rakulpreet) October 12, 2022