ఈ మధ్యకాలంలో బుల్లితెర సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ.. వరుసగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిజాలే అయినప్పటికీ, మరికొన్ని రూమర్లు సైతం ఉన్నాయి. నిన్నగాక మెున్న యాక్టర్ అనన్య నాగళ్ల పెళ్లి అంటూ వార్తలు రాగా.. దానిపై ఆమె స్పందిస్తూ.. నా పెళ్లికి నన్ను కూడా పిలవండి అంటూ.. సరదాగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షార్ట్ ఫిల్మ్ నటి, యూట్యూబ్ స్టార్ అయిన దేత్తడి హారిక.. ఓ ప్రముఖ యూట్యూబర్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ ఇండస్ట్రీలో వార్త చెక్కర్లు కొడుతోంది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడి పెళ్లి వార్త వైరల్ గా మారింది.
దేత్తడి హారిక.. తెలంగాణ యాసతో తనదైన డైలాగ్ లతో.. దేత్తడి యూట్యూబ్ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే హారిక బుల్లితెర షో అయిన బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో అభికి హారికకి మధ్య ఏదో ఉందని అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. కొంత మంది అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని, కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారని కూడా వ్యాఖ్యానించారు. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు కలిసిన సందర్బాలు చాలా తక్కువ. దాంతో అభి-హారిక మధ్య ఏం లేదని అభిమానులు అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఓ వార్త మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది. అదేంటంటే? త్వరలోనే హారిక పెళ్లి చేసుకోబోతుందట.
ఇక పెళ్లి కొడుకు ఎవరంటే.. తన తోటి యూట్యూబరే అంటూ వార్తలు వినిపిస్తోన్నాయి. వీరిద్దరు గత కొంత కాలంగా ప్రేమలో మునిగిపోయారని, కానీ ఆవిషయాన్ని ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేశారని పరిశ్రమలో వినికిడి. ఆ యూట్యూబర్ సైతం వీడియోస్ చేస్తూ.. సోషల్ మీడియాలో పాపులర్ బాయ్ గానే ఉన్నాడని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకైతే.. తన పెళ్లిపై వస్తోన్న వార్తలపై దేత్తడి హారిక స్పందించలేదు. అలాగే ఆమె కుటుంబం సైతం ఈ వార్తలకు సమాధానం చెప్పలేదు. ఇక ఈ వార్త తెలియడంతో హారిక అభిమానులు ఎవరబ్బా? ఆ యూట్యూబర్ అంటూ సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు.