మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా.. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. మంచి వసూళ్లు సాధిస్తూ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ ఓ యూట్యబర్ పాత్రలో నటించాడు. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. దర్శకుడు పూరీ జగన్నాథ్.. చిరంజీవిని ప్రత్యేంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సక్సెస్, ప్రజెంట్ చేతిలో ఉన్న సినిమాలతో పాటు.. పలు ఆసక్తికర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు దొర్లాయి. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్.. గాడఫాదర్ పూర్తిగా పొలిటికల్ డ్రామా.. మరి నిజ జీవితంలో మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అంటూ చిరంజీవిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన చెప్పిన సమాధానం నెట్టింట వైరలవుతోంది.
ఇంటర్య్వూలో పూరీ జగన్నాథ్ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించాడు. అన్నింకిటి ఎంతో హుషారుగా సమాధానం చెప్పారు చిరంజీవి. అలానే పాలిటిక్స్‌పై అడిగిన ప్రశ్నలకు కూడా అలానే సమాధానం చెప్పారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్.. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగాడు. అందుకు చిరంజీవి.. ‘‘ఇప్పటి వాళ్లలో ఎవరూ లేరు. నాకు చాలా ఇష్టమైన రాజకీయ నాయకుడు లాల్ బహుదూర్ శాస్త్రి. ఆయన గొప్ప నాయకుడు.. మహానుభావుడు’’ అని ప్రశంసించారు. ఆ తర్వాత ‘‘అటల్ బిహారి వాజ్‌పేయీ అద్భుతమైన నాయకుడు.. ఆయన ‘రియల్ స్టేట్స్‌మన్’’’ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇంటర్వ్యూలో భాగంగా పూరీ జగన్నాథ్.. స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎలాంటి అంశాలకు ఎక్కువ ప్రాధానం ఇస్తారు.. అసలు ఎలా సెలక్ట్ చేసుకుంటారు అని ప్రశ్నించాడు. అందుకు చిరంజీవిజ.. చాలా మంది కథ వింటారు. కానీ నాకు కథ వినిపించేటప్పుడే విజువల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ కాపీ నా ముందు ఉంటుంది. అలానే అది నా హృదయానికి టచ్ కావాలి… పాటలు, కామెడీ, ఫైట్స్ ఈ అంశాలన్ని.. కథ అనే ఓ స్త్రీ మూర్తికి అలంకారాల లాంటివి. అయితే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫ్లాప్‌లు వస్తాయి. మనం మానవ మాత్రులం.. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి’’ అని చెప్పుకొచ్చారు.
అలానే సినిమా హిట్టా ఫట్టా అన్న విషయం విడుదలకు ముందే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. వారు మామూలు వాళ్లు కాదు అన్నాడు. ఇక పూరీ.. సల్మాన్ ఖాన్ గురించి అడిగిన ప్రశ్నకు.. ‘అతడు నాకు తమ్ముడి లాంటి వాడు’ అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరలవుతోంది.