కొణిదేల నిహారిక.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కొన్ని వెబ్ సిరీస్ లకు నిర్మాతగా కూడా వ్యహరించింది. పలు షోల్లో పాల్గొన్ని తనదైన పంచ్ లతో నిహారిక అందరిని ఆకట్టుకుంది. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక నటనకు బై చెప్పేసి పూర్తిగా తన టైమ్ ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. నిహారిక ప్రస్తుతం బిజీ బిజీగా టూర్లు వేస్తుంది. ఈ మెగా డాటర్ ప్రస్తుతం టర్కీలో ట్రిప్ వేసింది. ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె ఎంజాయ్ చేస్తుంది. అయితే ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల నిహారిక ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసింది. నిహారిక సోషల్ మీడియాలో చాల యాక్టీవ్ గా ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకునే నిహారిక.. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని పలకరిస్తుంటుంది. అయితే నిహారిక ఎప్పుడూ కూడా గ్లామర్ పరంగా హద్దులు దాటలేదు. అప్పుడప్పుడు తన భర్తతో ఉన్నటువంటి రొమాంటిక్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా నిహారిక మరోసారి సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి నిహారిక టర్కీకి ట్రిప్ వేసింది. టర్కీలో తన ఫ్రెండ్స్ తో కలిసి నిహారిక బాగా ఎంజాయ్ చేసింది. టర్కీ ట్రిప్ కి సంబంధించిన పిక్స్ ను నిహారిక.. తన ఇన్ స్టా లో ద్వారా షేర్ చేసుకుంది. తన ఫ్రెండ్..టర్కీ భాషలో ఏదో మేసెజ్ చేసింది. ‘నాకు ఒక్క పదంకూడా అర్ధం కాలేదు. కానీ మంచి ఫన్ అందించినందుకు నీకు కృతజ్ఞతలు’ అంటూ నిహారిక రాసుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక టర్కీలో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.