భారతదేశం పండుగలకు పుట్టినిల్లు.. దేశంలో ఏ చిన్న పండుగలనైనా చాలా ఘనంగా నిర్వహించడం మనకు అలవాటు. ఇది మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఇక ఏ చిన్న పండుగలనైనా సెలబ్రిటీలు అత్యంత వైభవంగా జరుపుతారని మనందరికి తెలిసిందే. అలా వేడుకల్లో పాల్గొన్న పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఈ క్రమంలోనే కేరళ సోయగం అనుపమ పరమేశ్వరన్ సాంప్రదాయ బద్దంగా “ఓనం” పండుగలో మెరిసింది. వాటికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఓనం.. కేరళ సంప్రదాయ పండుగ. ఈ వేడుకను కుల, మతాలకు అతీతంగా ప్రజలు జరుపుకుంటారు. ఈ ఓనం పండుగ ఆగష్టు 30 న ప్రారంభం అయ్యి.. సెప్టెంబర్ 8 న ముగుస్తుంది. ఈ క్రమంలోనే మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఓనం పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన పిక్స్ ను తన సోషల్ మీడియా బ్లాగ్ లో పోస్ట్ చేసింది. అనుపమకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు వాళ్ల గుండెలు ఆగిపోతాయి. తాజాగా ఓనం సందర్భంగా తెల్లచీర, మల్లెపూలు పెట్టుకుని సాంప్రదాయ బద్దంగా ఫొటోలకు పోజులు ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. దానికితోడు ఈ ఓనం సందర్బంగా అందరు సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు తెలిపింది.
అయితే ఈ ఫోటోలను తన సహ నటుడు నిహాల్ కోదాటి తీసినట్లుగా చెప్పుకొచ్చింది. నిహాల్, అనుపమ కలిసి బటర్ ఫ్లై సినిమాలో నటిస్తున్నారు. ఓనం సందర్బంగా అనుపమ తన అందచందాలతో కుర్రకారుల మతులు పోగొడుతోంది. తెల్ల చీర, మల్లెపూలు, రింగు రింగుల జుట్టుతో మైమరపిస్తూ ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చి అభిమానులను మైమరపించింది. ప్రస్తుతం అనుపమ కార్తికేయ 2 సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తుంది. అనుపమ మరోసారి నిఖిల్ తో జతకట్టింది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో “18 పేజెస్” అనే మూవీ రానుంది. ఈ సినిమాకు పలనాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. మరి సంప్రదాయ పద్దతిలో కనిపించి కవ్విస్తోన్న అనుపమ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.