దేశవ్యాప్తంగా బిగ్ బాస్ ఎంత పాపులర్ షోనో మనకి తెలిసిందే. ఈ షోకి ఎక్కువగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నవారే వస్తారు. ప్రతీ ఒక్కరికీ ఒక కల ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవాలనో లేక వేరే కలలు నిజం చేసుకోవాలనో వస్తుంటారు. ఈ షోలో ఫైనల్ గా ఒకరే గెలుస్తారు. కానీ ఈ షోకి వచ్చిన తర్వాత చాలా మంది పాపులర్ అవుతారు. ఆ కారణంగా తమ వృత్తిలో బిజీ అవుతారు. చిన్న సెలబ్రిటీల పాలిట ఒక వరం ఈ బిగ్ బాస్. అలాంటి షోకి వచ్చే ముందు ఒక నటికి సరైన బట్టలు లేవట. షోలో పార్టిసిపేట్ చేద్దామంటే డబ్బులే లేవంట. 8 ఏళ్లుగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొందట. ఆ నటి మరెవరో కాదు, బాలీవుడ్ బిగ్ బాస్ ఓటీటీ షో ద్వారా పాపులర్ అయిన ఉర్ఫీ జావెద్. ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కానన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. తన జీవితంలో ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది ఉర్ఫీ జావెద్. తాను గత 8 సంవత్సరాలుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్నానని, పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయానని ఆమె వెల్లడించింది. బిగ్ బాస్ ఓటీటీ షోకి వచ్చే ముందు ఆమె దగ్గర డబ్బులు లేవని, షోలో వేసుకునేందుకు కావాల్సిన దుస్తుల్ని సైతం అప్పు చేసే కొనాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకుని బాధపడ్డారు. అయితే ఇంత ఆర్ధిక ఇబ్బందులు ఉన్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. A post shared by Uorfi (@urf7i) Urfi Javed reveals that she was in MASSIVE DEBT for 8 years; took a loan to enter Bigg Boss, wore borrowed clothes #BiggBoss #BiggBossOTT #EntertainmentNews #Uorfi #UorfiJaved https://t.co/tqxFjAHqyl — Bollywood Life (@bollywood_life) September 7, 2022 కేవలం వారం రోజులు మాత్రమే ఉండి ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఈ షో ద్వారా కొంత డబ్బు మిగుల్చుకుందామనుకున్న ఆమె కల నిజం కాకుండా పోయింది. అయితే షో ద్వారా వచ్చిన పాపులారిటీతో 35 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆ ఫాలోయింగ్ తోనే ఇన్స్టాగ్రామ్ లో ప్రకటనల ద్వారా నెలకి కొంత డబ్బు సంపాదించుకుంటుంది. బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఉర్ఫీ సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. దీని కోసం ఇన్స్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. అయినప్పటికీ ఆమె డోంట్ కేర్ అంటూ ముందుకు సాగిపోతుంది. బిగ్ బాస్ ఓటీటీ షోలో పార్టిసిపేట్ చేసేందుకు బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని బాధపడిన ఉర్ఫీ.. ఇప్పుడు డబ్బులు ఉన్నా గానీ సరైన బట్టలు కొనుక్కోలేకపోతుందని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. మరి బిగ్ బాస్ కి ముందు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయానని షోలో ఏడ్చిన ఉర్ఫీ జావెద్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) View this post on Instagram A post shared by Uorfi (@urf7i) View this post on Instagram A post shared by Uorfi (@urf7i) ఇది కూడా చదవండి: Liger Effect: రెంట్ కట్టలేక ముంబై ఫ్లాట్ ఖాళీ చేస్తున్న పూరీ జగన్నాథ్? ఇది కూడా చదవండి: అమ్మ బంగారం అమ్మి.. ఆ సినిమా తీసి అప్పుల పాలయ్యా: శర్వానంద్