Chiranjeevi: వెండి తెర ‘ఇంద్రసేనుడు’ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఉత్తేజ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఇండస్ట్రీలో చిరంజీవిని స్పూర్తిగా తీసుకునే వారిలో ఉత్తేజ్ ఒకరు. చిరుకు ఉత్తేజ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. తనకు చిరుతో ఉన్న అనుబంధానికి.. చిరుపై ఉన్న అభిమానానికి గుర్తుగా ఓ మంచి కవితతో ఉత్తేజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ కవితి ఇదే..
అన్నయ్యా పుట్టినరోజు
శుభాకాంక్షలు….😊😊😊😊🕺🏿🕺🏿🕺🏿🕺🏿🕺🏿🕺🏿
రేడియో లో
మెరుపులా… లా…లా
ఆడతా… తా. తా.
మీ పాట…
ఈటీవీ లో…
గువ్వా గోరింకతో
ఆడిందిలే బొమ్మలాట…
మీ డాన్స్..
ఎక్కడ విన్నా,
ఎక్కడ చూసినా,
ప్రతీ చోటా. మీ పుట్టినరోజు
విశేషాలు..సంబరాలు..
కేక్ కట్టింగ్స్….రక్త దానం శిబిరాలు…🙏🙏🙏
😊
శ్రీకృష్ణాష్టమి
చిరంజీవి పుట్టినరోజు
వినాయక చవితి
విజయదశమి…
ఇలా…
మా పండగ మీరు,
మా జాతర మీరు,
మా సంతోషం మీరు,
🌹🌹🌹🌹🌹🌹
దేహాన్ని ఆయుధం చేసుకుని
దాహాన్ని జీవితం చేసుకుని
లక్ష్యాల్ని దాసోహం చేసుకుని…
మా ” మెగాస్టార్” అయ్యారు
మా ” అన్నయ్య ” అయ్యారు
మీరు మా ఆరాధ్యం.🙏
🕺🏿🕺🏿🕺🏿🕺🏿🕺🏿🕺🏿
ఈ అప్రతిహత ప్రయాణంలో
పరోపకారమిదం
శరీరమయింది…
బాధార్తుల చేయూత
మీ జీవితమైంది….
సహాయాలు లక్ష్యాలు కావని
మీ మహోత్క్రుష్ట వ్యక్తిత్వం
చెప్తోంది…
మంచిపనులు మీ సహజగుణమై
సాక్షాత్కారమవుతోంది..
మీరు మా ఆదర్శం🙏🙏
మిమ్మల్ని చూస్తే
బ్రతుకు మీద నమ్మకం వస్తోంది.
మేము చేసుకున్న అదృష్టం
మీరు🙏
ఇది ఒక్కడి మాట కాదు..
ఎందరెందరో
బాధార్తుల, అన్నార్తుల
గుండె పలికే మాటలివి..
నీ జన్మ ధన్యం తండ్రీ!!!
మీరు చల్లగా ఉండాలి..
మీరు సంతోషంగా ఉండాలి..
🌹🌹🌹🌹🌹🌹🌹
లవ్ యూ అన్నయ్యా…
🙏🙏🙏🙏🙏🙏🙏
ఇవి కూడా చదవండి : Chiranjeevi: చిరంజీవి బర్త్ డే సందర్భంగా వైరల్ అవుతున్న అభిమాని ఓపెన్ లెటర్!