పెద్దలకు తాము తాతయ్య, అమ్మమ్మ కాబోతున్నాము అని తెలిస్తే దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఆ యువరాణి లేదా యువరాజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటారు. అయితే దానికి గుర్తుగా సీమంత వేడుకలు జరుపుకుంటారు. ఇలాంటి సంతోషాలకు సెలబ్రీటీలు అతీతం కాదు. వారు సైతం తాతయ్య అవుతున్నాము అంటే ఓ రకమైన భావోద్వేగానికి లోనవుతారు. అలాంటి వేడుకే.. నటుడు ఉత్తేజ్ ఇంట్లో జరిగింది..
నటుడు ఉత్తేజ్ కూతురు ‘చేతన’ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా వైభవంగా సీమంతం వేడుక జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్ చిన్నకూతురు.. సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. త్వరలోనే నా హీరో లేదా హీరోయిన్ వస్తున్నారు అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. సీమంతం వేడుకకు గాయనీలు గీతా మాధురి, శృతి, నటుడు తనీష్ హాజరయ్యారు.
‘కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే’ అని చేతన తెలిపింది. కాగా ఇటీవలే ఉత్తేజ్ సతీమణి పద్మావతి క్యాన్సర్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ‘చిత్రం’ సినిమాలో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకుంది.