టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తాడని పేరు తెచ్చుకున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ఆయన నుంచి ఓ మూవీ వస్తోందంటే చాలు అందులో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోతారు. అందుకే ఆయనకు యూత్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. అలాంటి సందీప్ కిషన్ నటించిన తాజా మూవీ ‘మైఖేల్’. ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్లలో విడుదలైందీ చిత్రం. ఈ సందర్భంగా తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను సందీప్ కిషన్ పంచుకున్నాడు. ప్రస్తుతానికి తాను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని ఆయన చెప్పాడు. టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా రిలేషన్‌లోకి వెళ్తానన్నాడు. అయితే గతంలో ప్రేమలో పడ్డానని.. అప్పుడు ఎదురుదెబ్బలు తగిలాయన్నాడు. బ్రేకప్ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని సందీప్ పేర్కొన్నాడు.
‘ప్రస్తుతం నేను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను. అది నాకు సెట్ కాదు. నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ను. నాకు సంబంధించిన విషయాలన్నీ పార్ట్‌నర్‌తో షేర్ చేసుకోవాలని భావిస్తా. ఎప్పుడూ తనతోనే మాట్లాడాలని, తనకు సమయం కేటాయించాలని అనుకుంటా. అంత సులువుగా వదులుకోలేను. అందుకే నాలాంటి వ్యక్తికి రిలేషన్ షిప్స్ చాలా డేంజరస్. గతేడాది నాకు బ్రేకప్ జరిగింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటకు వస్తున్నా’ అని సందీప్ కిషన్ వివరించాడు. గతంలో ఎవరితో ప్రేమలో ఉన్నాడనే విషయాన్ని మాత్రం ఆయన రివీల్ చేయలేదు. కాగా, ఒక హీరోయిన్‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు సందీప్ కిషన్. ఆమె తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని తెలిపాడు. లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత మనుషుల మనస్తత్వంలో ఎంతో మార్పు వచ్చిందన్న సందీప్.. ప్రస్తుత రోజుల్లో ఒక బంధాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదని వ్యాఖ్యానించాడు.