జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సామాన్యులు మొదలు.. సెలబ్రిటీల వరకు ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం జనసేనాని రాజకీయాల్లో చాలా యాక్టీవ్ అయ్యారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు.. పవన్ కళ్యాణ్‌కి మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. తాను కూడా పవర్ స్టార్‌కి పెద్ద అభిమానిని అని.. తమ కుటుంబం మొత్తం జనసేన మద్దతుదారులే అని ప్రకటించాడు నటుడు శివబాలాజీ. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుంచి జనసేనకు మద్దతుగా ఉన్నామని.. ఆయన ఒక్క మాట చెప్తే చాలు.. జనసేన పార్టీ కోసం మరింత యాక్టీవ్‌గా పని చేస్తామని చెప్పుకొచ్చాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు శివ బాలాజీ దంపతులు. ఈ సందర్భంగా వారు రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ఈ ఇంటర్వ్యూలో శివ బాలాజీ పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొస్తూ.. పవన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి తాము జనసేకు మద్దతుగా ఉన్నామని తెలిపారు. ‘‘నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు.. వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ నేను ముందు నుంచి పవన్ సార్‌కి సపోర్ట్‌గా ఉన్నాను. 2014 నుంచి ఆయనకు మద్దతిస్తున్నాను. రాజకీయాల్లోకి రాను కానీ.. ఆయన ఒక్క మాట చెబితే చాలు.. మా సోషల్ మీడియా ద్వారా పవన్ సార్ కోసం పని చేస్తాం. నూటికి నూరు శాతం ఆయన కోసం కష్టపడి పని చేస్తాం. పవన్ సార్‌కు ఓపిక ఎక్కువ. ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాలు చేసుకుంటూ బాగా సంపాదించుకోవచ్చు. కానీ ఆయన ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి కష్టపడుతున్నారు. పవన్ సార్‌కున్నంత ఓపిక నాకు లేదు’’ అన్నాడు శివ బాలాజీ.
ఇక మధుమిత బంధువులంతా.. కోస్తా ప్రాంతం వారని.. ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌లో సెటిల్ అయ్యినా సరే.. ఎన్నికలప్పుడు ఓటేయడం కోసం సొంత ఊళ్లకు వెళ్తారని చెప్పుకొచ్చాడు. మధుమిత వాళ్ల మామయ్య.. మరికొందరు కుటుంబ సభ్యులు.. జనసేన తరఫున పని చేస్తున్నారని తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్‌లోని మానవతా గుణం అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఇక శివబాలాజీ టాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బన్నీతో కలిసి నటించిన ఆర్య సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత చందమామ, సంక్రాంతి వంటి సినిమాలతో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 1 విన్నర్‌గా నిలిచాడు. వ్యాపార కుటుంబానికి చెందని శివబాలాజీ.. సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాడు. ఇండస్ట్రీకి చెందిన మధుమితను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. శివబాలాజీకి.. పవన్ కళ్యాణ్‌తో మంచి అనుబంధం ఉంది.
మా ఫుల్ సపోర్ట్ @PawanKalyanగారికే 2014 నుంచి @JanaSenaPartyకి సపోర్ట్ చేస్తునాము ఆయన ఒక పిలిపిస్తే చాలు ఇంకా ఆక్టివ్ గా work చేస్తాం
– యాక్టర్ శివ బాలాజీ మధులత❤😍 pic.twitter.com/f2dBNStZZz— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) January 18, 2023