Noel Sean: తెలుగు సినీనటుడు, ర్యాపర్ నోయెల్ ప్రేక్షకులకు సుపరిచితమే. నటుడిగా ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ర్యాప్ సాంగ్స్ ద్వారా యూత్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక బిగ్ బాస్ లో అడుగుపెట్టాక నోయెల్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. ఈ క్రమంలో బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమన్ టీవీతో ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఇక ఇంటర్వ్యూ కెరీర్, కొత్త సినిమాల గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్న నోయెల్.. బిగ్ బాస్ ఎక్సపీరియెన్స్ కూడా బయట పెట్టాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ షోపై నోయెల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. బిగ్ బాస్ హౌస్, కేవలం లిమిటెడ్ కంటెస్టెంట్స్, మొబైల్ లేకుండా అన్ని రోజులు ఎలా ఉన్నారు? మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అని అడిగింది యాంకర్.
ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన నోయెల్.. బిగ్ బాస్ హౌస్ లో సాధారణ మనుషులు ఉండలేరని, అందులో తిండి, నిద్ర సరిగ్గా ఉండవని చెప్పాడు. అలాగే బయట హాస్పిటల్స్, టెంపుల్స్ ఒకే కలర్ లో ఉంటాయి. ఎందుకంటే మానసిక ప్రశాంతత కోసం. కానీ బిగ్ బాస్ హౌస్ లో 300 కలర్స్ ఉంటాయి. అవి చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఆ వాతావరణంలో టెన్షన్, కోపం, ఫుడ్ ఉండదు, ఏడవడం, బాధపడటం లాంటివన్నీ తెలియకుండానే జరుగుతుంటాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నోయెల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి నోయెల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.