తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాని.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. పక్కింటి అబ్బాయి యాక్టింగ్ తో పరిశ్రమలో నేచురల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు నాని. అయితే నాని నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ప్రేమకథలు, కుటుంబ కథలే. ప్రస్తుతం ‘దసరా’ అనే పక్కా మాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు నాని. ఈ క్రమంలోనే దసరా మూవీకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదల వేడుకలో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘దసరా’ నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న దసరా మూవీ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ వేడుకలో తెలంగాణ యాసలో మాట్లాడి స్టూడెంట్స్ లో ఫుల్ జోష్ ను నింపారు హీరో నాని. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఈ టీజర్ ఈవెంట్ కార్యక్రమంలో నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ”మీ అందరిని చూస్తుంటే నాకు ఒక మాట ఇవ్వాలనిపిస్తోంది. అందుకే మీకు ఒక మాటిస్తున్నాను. దసరా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరందరు ఈ కాలేజీ చెట్లకింద, గట్లపైన కూర్చుని దసరా మూవీ గురించే మాట్లాడుకుంటారు. ఇది పక్కా.. ఇక 2022లో ఒక KGF, ఒక RRR 2023లో ఒక దసరా ఇది పక్కా.. అదీ లెక్క” అని మాస్ స్టేట్ మెంట్ ను ఇచ్చారు నాని.
ఈ సందర్బంగా దసరా సినిమా సక్సెస్ మీట్ కు వచ్చినప్పుడు స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తానని నాని చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసించాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ కు కొన్ని గంటల్లోనే విశేష స్పందన లభిస్తోంది. పవర్ ఫుల్ డైలాగ్స్.. ఊరమాస్ యాక్షన్, ఇంటెన్సీవ్ టేకింగ్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది టీజర్. ఇక ఈ సినిమాలో పక్కా తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లో విజిల్స్ పడటం ఖాయంగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి KGF, RRR సినిమా రేంజ్ లో దసరా మూవీ ఉంటుంది అన్న నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.