చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు న్యాచురల్ స్టార్ నాని. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని కష్టపడుతున్నారు. త్వరలో విడుదల కానున్న ‘దసరా’ను ఆయన తెగ ప్రమోట్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా క్రేజ్ సంపాదించుకున్నారు నాని. తనదైన నటనతో అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటూ న్యాచురల్ స్టార్ అనే ఇమేజ్ సంపాదించారు. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి నానికి ఈమధ్య సరైన హిట్లు పడలేదు. 2019లో వచ్చిన ‘జెర్సీ’ తర్వాత ఆ స్థాయి విజయం మళ్లీ రాలేదు. ‘గ్యాంగ్ లీడర్’, ‘టక్ జగదీష్’ చిత్రాలు ఆడియెన్స్‌ను అంతగా ఆకట్టుకోలేదు. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్లలో మాత్రం నాని స్టామినాను అందుకోవడంలో విఫలమైంది.
గతేడాది రిలీజైన ‘అంటే సుందరానికీ’ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఏ క్లాస్ ఆడియెన్స్ మాత్రమే దీనికి అండగా నిలిచారు. సాధారణంగా నాని చిత్రాలకు యువత నుంచి ఆదరణ బాగా ఉంటుంది. కానీ ఈమధ్య ఆయన సినిమాలు వారికి కనెక్ట్ అవ్వట్లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసిమీద ఉన్నాడీ యంగ్ హీరో. ఇప్పుడు ‘దసరా’ సినిమాతో అందర్నీ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని అన్నట్లు.. ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో రచ్చ చేయాలని ప్లాన్ వేస్తున్నాడు నాని.
‘దసరా’ నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈసారి యూత్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు నాని. ట్రైలర్ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. తెలంగాణ నేటివిటీ, ఫైట్స్, పాటలు అంతా వైవిధ్యంగా ఉన్నాయి. నాని కూడా ఊరమాస్ అవతారంలో సరికొత్తగా కనిపిస్తున్నాడు. కంటెంట్ బాగుండటం, నాని లుక్‌తో సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయినా నాని ‘దసరా’ను ఇంకా ప్రమోట్ చేస్తున్నాడు. హిందీ రిలీజ్‌ను దృష్టిలో ఉంచుకుని ట్రైలర్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో రిలీజ్ చేశారు.
లక్నోలో నానికి అభిమానుల నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఈ సందర్భంగా అక్కడి ప్రతిభ థియేటర్ దగ్గర లారీ ఎక్కి ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు న్యాచురల్ స్టార్. అలాగే ప్రఖ్యాత రాయల్ కేఫ్‌లో కస్టమర్లకు తన చేతులతో వడ్డించారు. ట్రైలర్ లాంఛ్ తర్వాత హిందీ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘దసరా’ ప్రమోషన్స్ కోసం ఇటీవలే తమిళనాడును కూడా సందర్శించారు నాని. ఈ విధంగా ఎక్కడా తగ్గేదేలే అంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. న్యాచురల్ స్టార్ గంపెడాశలు పెట్టుకున్న ‘దసరా’ ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. మరి.. నాని అప్‌కమింగ్ మూవీ ‘దసరా’ను చూసేందుకు మీరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Natural 🌟 @NameisNani & Team #Dasara visited the most famous ROYAL CAFE in Lucknow.
They have tasted special Chat & #Nani served to some of the customers. 😍😍#DasaraOnMarch30th 🔥 @SLVCinemasOffl pic.twitter.com/yofA4Fz66M
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 14, 2023
A launch to remember!
South’s superstar Nani makes a spectacular entry on the truck at the trailer launch of his highly anticipated film #Dasara in Lucknow! 😍@nameisnani#Nani #massalert#Dasara #DasaraOnMarch30th @viralbhayani77 pic.twitter.com/vvzfbujrSG— Viral Bhayani (@viralbhayani77) March 14, 2023