ఈ మద్య సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీ నటులు అరుదైన వ్యాధితో బాధపడున్నట్లు సోషల్ మీడియా వేధికగా చెబుతున్నారు. సమంత, అనుష్క శెట్టి, పూనం కౌర్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది నటులు తమకు వచ్చిన వ్యాధికి చికిత్స తీసుకుంటున్నామని తెలిపుతున్నారు.. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నామని బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటి పలువురు నటీనటులు క్యాన్సర్ భారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇటీవల నటి సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. పూనమ్ కౌర్ ఫైబ్రో మయాల్జియా తో బాధపడుతున్నానని.. కేరళాలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక అందాల భామ అనుష్క శెట్టి సైతం ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. తనకు నవ్వే జబ్బు ఉందని.. ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే 20 నిమిషాల వరకు అలా కంటిన్యూ చేస్తానని చెప్పింది. మమత మోహన్ దాస్, శృతి హాసన్‌తో సహా పలువురు నటీనటులు తమ వ్యాధి గురించి బయటపెట్టారు. తాజాగా హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లీస్ సంవత్సరం క్రితం ఫ్రోంటోటెంపోరల్ డిమెన్షియా అని విచిత్రమైన వ్యాధి భారినపడ్డారు. దీనికి చికిత్స లేదని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ దిగ్గజ నటుడు ‘డై హార్డ్’ మూవీ ఫేమ్ బ్రూస్ విల్లీస్ గత ఏడాది నుంచి ‘ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా’ అనే మెదడుకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధి భారినపడ్డారు. ఈ విషయం గురించి బ్రూస్ విల్లిస్ కుటుంబ సభ్యులు మీడియా వేధికగా తెలిపారు. అంతేకాదు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో.. దాని వల్ల ఆయన ఎలాంటి బాధపడుతున్నారో అన్న విషయం గురించి తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల పాటు హాలీవుడ్ లో ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించారు బ్రూస్ విల్లీస్. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. నటుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా పలువురు నటులకు డబ్బింగ్ చెప్పేవాడు. కానీ ప్రస్తుతం ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ వ్యాధి భారి పడ్డవారికి చికిత్స ఉండదని.. మెదడు కణాల్లో అసాధారణ రీతిలో ప్రభావం చూపిస్తుందని.. ప్రొటీన్లు పేరుకుపోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీని ఫలితంగా మెదడులో చాలా రకాల సమస్యలు తలెత్తుతాయని కుంచించుకుపోవడం మొదలవుతుందని అంటున్నారు. ఈ వ్యాధి ముదిరేకొద్ది రోగి యొక్క ప్రవర్తనలో అనేక మార్పులు వస్తాయని.. నడక లో మార్పు, సరిగా మాట్లాడలేకపోవడం.. చిరాకు, కోపం, మానసిక సమస్యలు లాంటివి వస్తాయని వైద్యులు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వ్యాధి పూర్తి స్థాయిలో ముదిరిపోతే ఆయన బతికి ఉన్నా లేనట్లే అని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతానికి బ్రూస్ బాగానే ఉన్నారని.. భవిష్యత్ లో ఆయన మనోధైర్యంతో ముందుకు సాగాలాని.. ఇతర సమస్యలకు తాము చికిత్స అందిస్తామని అంటున్నారు.
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘డై హార్డ్’ మూవీతో బాగా పాపులర్ అయ్యారు బ్రూస్ విల్లిస్. హాలీవుడ్ దిగ్గజ నటులతో కలిసి నటించారు. ‘మూన్ లైటింగ్’ అనే టివీ షో తో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు బ్రూస్ విల్లీస్. ఆయన కెరీర్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, రెండు ఎమ్మీ అవార్డ్స్ లు సొంతం చేసుకున్నారు. ఇక తమ అభిమాన హీరో అనారోగ్యం భారి పడ్డాడన్న విషయం తెలుసుకొని అభిమానులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటూ హాలీవుడ్ నటులు, మిత్రులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.
Die Hard Star Bruce Willis Diagnosed With “Untreatable” Dementia, Says Family https://t.co/Vi1rjDs2jn pic.twitter.com/Km5kl2pw9J
— NDTV (@ndtv) February 17, 2023