తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నోసినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు నటుడు భాను చందర్. తెలుగు, తమిళం వంటి భాషల్లో అనేక చిత్రాల్లో కనిపించిన ఆయన తన నటనతో మంచి నటుడిగా గుర్తింపును మూటగట్టుకున్నాడు. ఇక నిరీక్షణ సినిమాతో హీరోగా పరిచయమైన భాను చందర్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో సహయనటుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే భాను చందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఇందులో తన సినిమా కెరీర్, తను నటించిన సినిమాలతో పాటు ఎన్నో వ్యక్తిగత విషయాలను సైతం మనసు విప్పి వివరించాడు. ఇక వీటితో పాటు టాలీవుడ్ అగ్రదర్శకుడైన రాజమౌళిపై కూడా ప్రశంసల వర్షం కురింపించాడు. ముంబయిలో ఉంటున్న రోజుల్లో నైట్ క్లబ్స్ లో మ్యజిషియన్ గా పని చేశానని, ఆ క్రమంలోనే డ్రగ్స్ కు అలవాటుపడ్డానని భాను చందర్ తెలిపారు. ఇక అనంతరం తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని దాని కారణంగానే పూర్తిగా డ్రగ్స్ కు దగ్గరైనట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Singeetham Srinivasa Rao: సింగీతం శ్రీనివాసరావు ఇంట తీవ్ర విషాదం!ఇక నేను నటుడిగా కనిపించాలని మా అమ్మ ఎన్నో కలలు కంది. దీంతో అప్పుడు అనేక ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నానని భాను చందర్ అన్నారు. శిక్షణ తీసుకుంటున్న సమయంలో చిరంజీవి, రజినీకాంత్ పరిచయమయ్యారని, ఇక నాకు బైక్ నడపడం నేర్పింది చిరంజీవి అంటూ భాను చందర్ తన కెరీర్ లో జరిగిన విషయాలను పంచుకున్నారు.
ఇక సింహాద్రి సినిమా చేస్తున్న క్రమంలో రాజమౌళికి నువ్వు తప్పకుండా సెన్సేషనల్ డైరెక్టర్ అవుతావ్ అని చెప్పాను. ఇప్పుడు దేశంలోనే రాజమౌళి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారంటూ ఆయనపై ప్రశంసలు వర్షం కురిపించాడు. అందరూ ఆయన నుంచి టెక్నిక్స్ నేర్చుకోవాలని సూచించారు. ఉత్తరాదిలోనూ కూడా రాజమౌళిని తలదన్నేవారు లేరంటూ భాను చందర్ ఈ దర్శకధీరుడిని ఆకాశానికెత్తాడు. రాజమౌళిపై నటుడు భాను చందర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.