మాధవి లత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవి లత. ఆ వివరాలు..
నచ్చావులే సినిమాతో మంచి విజయం అందుకుంది తెలుగమ్మాయి మాధవి లత. తర్వత వరుసగా కొన్ని చిత్రాల్లో చేసినప్పటకి.. ఆశించిన మేర గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజేపీలో చేరింది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తోంది. కృష్ణతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని కృషి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది మాధవి లత. తన చుట్టూ చోటు చేసుకునే అంశాలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది మాధవి లత. ఇండస్ట్రీలో తనకు ఎదరైన చేదు అనుభవాల గురించి కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మాధవి లత. ‘‘సామాన్యంగా నేను ఎవరిని బాధ పెట్టను. కానీ టెంపర్ కోల్పోతే మాత్రం.. ఎదురుగా ఎవరు ఉన్నారు అనేది చూడను. మాటలు అనేస్తాను. నాకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సమస్యలు లేవు. ఈ విషయం ఎవరూ నమ్మరు. ఎవరైనా నిర్మాతనో.. మరో వ్యక్తో నాతో తప్పుగా మాట్లాడితే.. నేను అరవను. వారి మాటల వల్ల ఎంత కోపం వచ్చినా సరే.. శాంతంగానే బదులిస్తాను. నేను మీరు అనుకునే మనిషిని కాదండని చెప్పి వెళ్లి పోతాను. ముందు రోజు.. వస్తావా.. అని వంకరగా మాట్లాడిన వాళ్లే.. మరుసటి రోజు నుంచి నన్ను అమ్మ అని పిలిచిన వ్యక్తులు ఉన్నారు.
‘‘ఇండస్ట్రీలో మనం ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో.. అలానే ఉండాలి. కూల్‌గా నెమ్మదిగా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి’’ అని చెప్పుకొచ్చింది మాధవి లత. అంతేకాక గతంలో మీడియాలో తన గురించి వచ్చిన వార్తలపై స్పందించింది మాధవి లత. ‘‘నాకు మైగ్రేన్ సమస్య ఉంది. వినడానికి ఇది చిన్న ప్రాబ్లమే అనిపిస్తుంది. కానీ అనుభవించేవారికే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అందుకే నేను ఎప్పుడు టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. ఇలా ఉండగా ఓ రోజు ప్రేమ సినిమా చూశాను. దానిలో రేవతి.. చీటికి మాటికి మాత్రలు మింగడం వల్ల.. చివరకు ఆమె మీద ఏ మందులు పని చేయని స్టేజ్‌కు వస్తుంది. అది చూసి.. భవిష్యత్తులో నాకు ఇలానే అవుతుందేమో అని అనిపించింది. డిప్రెషన్‌కు గురయ్యాను. ఆ ఆలోచనతోనే.. చివరకు నాకు కూడా ఏ టాబ్లెట్ పని చేయదేమోనని పోస్ట్ పెట్టేసి పడుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.
‘‘తెల్లారి నేను నిద్ర లేచేసరికి.. మీడియాలో నేను చనిపోబోతున్నాను అంటూ వార్తలు. నా బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసి చెప్తే.. చూశాను. ఆ వార్తలు చూసి షాకయ్యాను. నేను నిద్ర లేచే సరికే ఇంత జరిగిందా అనుకున్నాను. లాక్‌డౌన్ కంటే ముందే నాకు డిప్రెషన్ వచ్చేసింది. అప్పుడు అదింకా ఎక్కువైంది. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. కానీ నేను ఆ పని చేయాలనుకోలేదు.. ఎలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేయలేదు’’ అని చెప్పుకొచ్చింది మాధవిలత. మరి ఆమె చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.