Monica Dogra: ప్రముఖ అమెరికన్ నటి, గాయని మోనికా డోగ్రా తన పర్సనల్ లైఫ్, పాన్సెక్సువల్ జెండర్ గురించి ఓపెన్ అయ్యారు. తన జెండర్ గురించిన కొన్ని అనుభవాలను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మోనికా డోగ్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను మొదటి సారి నా జెండర్ గురించి తెలుసుకున్నపుడు చాలా బాధపడ్డా. అగాథంలోకి పడిపోయినట్లుగా అనిపించింది.
సిగ్గుతో చచ్చిపోయా. కాలేజీలోకి అడుగుపెట్టే వరకు నాకు ఎలాంటి శృంగార అనుభవాలు లేవు. ఎవర్నీ ముద్దు కూడా పెట్టుకోలేదు. ఓ సారి పార్టీలో బాగా తాగాను. అప్పుడు ఓ అమ్మాయి మీద నాకు ప్రేమ కలిగింది. అది కూడా మగవాళ్లలాగా కనిపించే ఆ అమ్మాయి మీద నాకు ప్రేమ కలిగింది. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నాలో ఏం జరుగుతోందో నాకు అప్పుడు అర్థమైంది.
నేను ఓ బైసెక్సువల్ని అనుకున్నా. నాకు ఆడవారి లక్షణాలు ఉన్న అబ్బాయిలు, మగవారి శరీర ఆకృతి ఉన్న అమ్మాయిలు నచ్చటం మొదలైంది. తర్వాత నాకు రహస్యంగా పెళ్లయింది. కొన్ని నెలల తర్వాత నా సహ నటితో ప్రేమలో పడ్డా. దీంతో నా లక్షణాల కారణంగా భర్తతో సంతోషంగా ఉండలేకపోయా. ఆయన చాలా మంచివారు. నన్ను అర్థం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నాం.
అప్పుడే నేను ఓ పాన్సెక్సువల్ అన్న సంగతి తెలిసింది. అది చాలా వింతగా అనిపించింది. 2016లో ఎల్జీబీటీ కమ్యూనిటీకి క్రౌడ్ ఫండింగ్ చేసినపుడు భారతీయ మీడియా నాపై ద్వేషపూరిత కథనాలు రాసింది. అప్పుడు చాలా బాధపడ్డా’’ అని చెప్పుకొచ్చింది. మరి, మోనికా డోగ్రా ఆవేధనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Krithi Shetty: ఆ మూవీ షూటింగ్ సమయంలో ఇబ్బంది పడ్డాను.. కృతిశెట్టి కామెంట్స్!