ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఎలా ఉంటాయో జనాలకు బాగా తెలుసు. పరిచయాలు, ప్రేమలు, కుదిరితే డేటింగ్.. ఆ తర్వాత పెళ్లి. అది కూడా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. ప్రేమించి వివాహం చేసుకున్నా సరే.. తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయిన సెలబ్రిటీలు ఎందరో ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుంటారు. సామాన్యులయితే విడాకులు తీసుకోవాలన్నా.. మరో వివాహం చేసుకోవాలన్నా.. ఎన్నో ఆలోచిస్తారు. కానీ కొందరు సెలబ్రిటీల జీవితాలను పరిశీలిస్తే.. వారికి ఇలాంటి సంశయాలు ఏం ఉండవని.. తమకు నచ్చినట్లు.. తాము జీవిస్తారని అర్థం అవుతుంది. ఎవరి కోసం మారరు.. ఎవరిని పట్టించుకోరు. తమకు నచ్చింది చేస్తారు. ఈ క్రమంలోనే నచ్చిన వ్యక్తిని ప్రేమించడం, వివాహం చేసుకోవడం.. వద్దు అనుకుంటే విడాకులు తీసుకోవడం… ఆ తర్వాతో మరో వ్యక్తితో బంధంలోకి అడుగుపెట్టడం.. ఇలా కొనసాగుతుంది వారి జీవితం.
తాజాగా ఈ నటి జీవితాన్ని పరిశీలిస్తే.. పైన చెప్పిన వ్యాఖ్యలు ఆమె సూట్ అవుతాయి అనిపిస్తాయి. ఎందుకంటే.. సదరు నటి ఇప్పటికే ముగ్గురిని వివాహం చేసుకుని.. డైవర్స్ తీసుకుంది. తాజాగా సీక్రెట్‌గా నాలుగోసారి వివాహం చేసుకుని.. అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక నటి వివాహం చేసుకున్న వ్యక్తికి ఇది రెండో వివాహం. మరి నాలుగో పెళ్లి చేసుకున్న సదరు నటి ఎవరు.. ఇంతకు ఆమె వివాహం చేసుకుంది ఎవరిని వంటి వివరాలు..
హాలీవుడ్ అగ్రతారలు బెన్ అఫ్లేక్, జెన్నిఫర్ లోపేజ్ అనేక రూమర్లకు తెరదించుతూ వివాహం చేసుకొన్నారు. జెన్నిఫర్ లోపేజ్‌కు ఇది నాలుగో వివాహం. తొలి వివాహం ఓజాని నోతో జరిగింది. వారిద్దరు 1997 నుంచి 1998 వరకు కాపురం చేశారు. ఆ తర్వాత క్రిస్ జడ్‌ను 2001లో వివాహం చేసుకొని.. 2003లో విడిపోయారు. ఆ తర్వాత మార్క్ ఆంథోనిని 2004లో వివాహం చేసుకొని.. అదే సంవత్సరం విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం బెన్ అఫ్లెక్‌ను 2022లో వివాహం చేసుకుంది.
ఇక బెన్ అఫ్లెక్ వైవాహిక జీవితం విషయానికి వస్తే.. ఇది ఆయనకు రెండో పెళ్లి. వీరిద్దరూ తొలిసారి 2005 నుంచి 2018 వరకు డేటింగ్ చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాలు రావడంతో విడిపోయారు. తిరిగి మళ్లీ 2022లో వీరిద్దరరూ వివాహం చేసుకొన్నారు. వీరిద్దరికి ముగ్గురు సంతానం ఉన్నారు. కొన్ని రోజుల క్రితం జెన్నిఫర్ చేతికి ఉన్న రింగ్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అయ్యింది. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి వార్తలు ఎక్కువ అయ్యాయి. ఈ రింగ్ చూసిన నెటిజనులు.. నిశ్చితార్థం అయిపోయిందని.. త్వరలోనే ఆమె వివాహం చేసుకొంటుందనే వార్తలు గత కొద్ది నెలలుగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బెన్ అఫ్లెక్‌తో డేటింగ్ వ్యవహారం మీడియాలో బహిరంగమైంది.
హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. జెన్నిఫర్ లోపేజ్‌ను బెన్ అఫ్లెక్ అమెరికాలోని నెవడాలోని క్లార్క్ కౌంటీలో జూలై 16వ తేదీన వివాహం చేసుకొన్నారు. వివాహం అనంతరం చట్టబద్దంగా మ్యారేజ్ ధృవీకరణ పాత్రలను తీసుకొన్నారు. అతికొద్ది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య వీరి వివాహం జరిగింది. జూలై 16వ తేదీన జరిగిన పెళ్లి విషయాన్ని మీడియాకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయినా వారిద్దరి పెళ్లి వార్త మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయింది. నాలుగో వివాహం చేసుకుంటున్న జెన్నిఫర్ తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచడం వెనక కారణం ఏంటని నెటిజనులు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.