భారతీయ చిత్ర పరిశ్రమ స్థాయి రోజు రోజుకు పెరిగి పోతోంది. తెలుగు హీరోలు బాలీవుడ్ లో.. బాలీవుడ్ హీరోలు తెలుగులో నటించటం చూస్తూనే ఉన్నాం. అలాగే బాలీవుడ్ నటీ, నటులు హాలీవుడ్ లో సైతం నటిస్తున్నారు. తాజాగా తమిళ హీరో ధనుష్ ‘గ్రే మ్యాన్ ‘ద్వారా హాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్టిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇచ్చిన ఇంటర్య్వూలో ధనుష్ పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశాడు. మరి దానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
Chris Evans isn’t the only kick-ass opponent Ryan Gosling and Ana De Armas have to fight off in The Gray Man.
Enter @dhanushkraja pic.twitter.com/YFQBxbJCGw
— Netflix (@netflix) July 22, 2022
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. చిత్ర పరిశ్రమ ఏదైనా కావొచ్చు.. ఒక మూవీ బాగుంది అంటే చాలు ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఓటీటీలు రావడంతో నటులు మరింతగా ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు. ఈ నేపధ్యంలో హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయంశం అవుతున్నాయి. తాజాగా గ్రే మ్యాన్ మూవీకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ ను ‘బాలీవుడ్ ను దక్షిణాది చిత్రాలు డామినేట్ చేస్తున్నాయా? అంటూ యాంకర్ అడగ్గా.. దానిపై స్పందిస్తూ..
”నన్ను తమిళ నటుడు అంటే ఆనందంగానే ఉంటుంది.. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి. ఇప్పుడు వస్తోన్న చిత్రాలు అన్నీ భారతీయ చిత్రాలే. వాటికి భాషతో సంబంధం లేదు. ఎందుకంటే ఇటీవల ఓటీటీల వాడకం పెరిగింది దీంతో ప్రతీ చిత్రం ప్రేక్షకుల దగ్గరకు చేరుతోంది. అలాగే ”చిత్ర పరిశ్రమకు హద్దులు లేవు”. అని సినిమాలను ప్రాంతీయత ఆధారంగా చూడరాదు. అంటూనే సౌత్ యాక్టర్స్,నార్త్ యాక్టర్స్ అనే వారు లేరని ఉన్నదల్లా భారతీయ నటులే” అని వెల్లడించారు. తాజాగా ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారయి. మరి అందరిని భారతీయులుగానే చూడాలంటున్న హీరో ధనుష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Chiranjeevi: చిరంజీవిపై విషప్రయోగం చేయించింది ఎవరు? ఇప్పటికీ వీడని మిస్టరీ?
ఇదీ చదవండి: Sri Reddy: పెళ్లి కాకుండానే గర్భం.. తీయించుకోలేని పరిస్థితి..! శ్రీరెడ్డి ఎమోషనల్!