ఆమె ఓ స్టార్ నటి.. 1990, 2000వ దశకాల్లో తన నటనతో, అందచందాలతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, ఆమె నడి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ కనిపించింది.
ఆమె ఓ స్టార్ నటి.. 1990, 2000వ దశకాల్లో తన నటనతో, అందచందాలతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, ఆమె నడి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ కనిపించింది. ఓ కారు నుంచి దిగిన ఆమె ఒంటిపై నూలు పోగు లేకుండా రోడ్లపై తిరుగుతూ కనిపించింది. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? పోలీసులకు ఫోన్ చేసింది ఎవరో కాదు ఆ స్టార్ నటే. దాంతో అవాక్కైయ్యారు పోలీసులు. మరి ఈ వింత సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెలితే..
అమెండా బైన్స్.. హాలీవుడ్ లో స్టార్ నటిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. 1990, 2000వ దశకాల్లో కుర్రకారును ఓ ఊపుఊపింది. అయితే తాజాగా అమండా బైన్స్ లాస్ ఏంజెల్స్ వీధుల్లో ఒంటిపై నూలుపోగు లేకుండా తిరిగింది. దాంతో అందరు ఆమెను చూసి ఆశ్చర్య పోయారు. వివరాల్లోకి వెళితే.. అమండా బైన్స్ లాస్ ఏంజెల్స్ వీధిలో ఓ కారు నుంచి దిగింది. కారు నుంచి దిగగానే అందరు ఆమెను ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. ఎందుకంటే.. ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేదు. ఇక తాను సైకియాట్రిక్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడే వస్తున్నట్లు ఆ కారు డ్రైవర్ కు చెప్పింది. బట్టలు లేకుండా లాస్ ఏంజెల్స్ రోడ్లపై తిరిగింది. అయితే మళ్లీ అమండానే పోలీసులకు ఫోన్ చేసి ఓ యువతి రోడ్లపై నగ్నంగా తిరుగుతోంది అని చెప్పింది. దాంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు మానసిక నిపుణులకు సమాచారం అందివ్వడంతో.. వారు స్టేషన్ కు వచ్చారు. ఇక ఆమె మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు, అమాండా బైపోలార్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెను ఫెసిలిటీ కేర్ లోనే ఉంచారు. ఇక అక్కడే ఆమెకు మరికొన్ని రోజులు చికిత్స అందించనున్నారు. 36 సంవత్సరాలు ఉన్న అమాండ గత కొంత కాలంగా మానసిక సమస్యతో బాధపడుతోంది. కొన్ని రోజుల క్రితం పక్కింటికి నిప్పంటించడం, పెంపుకు కుక్కను చంపాలి అనుకోవడం లాంటి పనులు చేసింది. మరికొన్ని రోజులు ఆమెను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచనున్నారు. కొన్ని నెలలుగా అమాండ డ్రగ్స్ కు బానిసైనట్టు సమాచారం.