హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ నటుడు క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు. 94వ ఆస్కార్ అవార్డుల ఈవెంట్ వేదికగా కమెడియన్ క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పాడు విల్ స్మిత్. ఈ ఘటనపై బహిరంగంగా స్మిత్ స్పందించడం ఇదే మొదటిసారి.
కమెడియన్ స్టార్ క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు విల్ స్మిత్. ఈ క్రమంలో ఆయన తన ఇన్ స్ట్రాలో ఓ వీడియో షేర్ చేశారు. క్రిస్ రాక్ తో తాను మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని.. కానీ అతను మాత్రం తనకు సమాధానం ఇవ్వలేదని అన్నారు. రాక్ మాట్లాడని అనుకుంటే మనస్ఫూర్తిగా మాట్లాడుతాను. అంతేకాదు అతని కుటుంబ సభ్యులను కూడా క్షమాపణలు కోరినట్లు విల్ స్మిత్ తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్ రాక్ ని బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నాను అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.
ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ప్రధానం చేసే సమయంలో హాలీవుడ్ సూపర్ స్టార్ హీరో విల్ స్మిత్ భార్య జాడ పై కామెడీ చేయటంతో చిర్రెత్తుకొచ్చి స్టేజ్ పైనే విల్ స్మిత్.. క్రిస్ నీ చెంపమీద కోట్టడం తెలిసిందే. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అవార్డు అందుకున్న తర్వాత… క్రిస్ కి క్షమాపణలు చెప్పడం మాత్రమే కాదు నిర్వాహకులకు, నామినిలకు కూడా విల్ స్మిత్ క్షమాపణలు తెలియజేశాడు.