విశ్వక్ సేన్ పేరు ఇటీవల ఓ వివాదం వల్ల చాలా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతని సినిమా రిలీజ్ కావడం, అది సూపర్ డూపర్ హిట్ కావడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. ప్రస్తుతం మరోసారి విశ్వక్ సేన్ పేరు వైరల్ గా మారింది. నెగెటివ్ విషయంలో కాదులెండి.. అప్ కమింగ్ మూవీ విషయంలో నెట్టింట విశ్వక్ పేరు వైరల్ గా మారింది. అదేంటంటే.. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో అదికూడా అర్జున్ కుమార్తె హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం బాగా జరుగుతోంది. అయితే దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
విశ్వక్ సేన్ ప్రస్తుతం అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా బెంజ్ కంపెనీకి చెందిన తన డ్రీమ్ కారును కూడా కొనుగోలు చేసి ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అయితే అతనికి ఇంకా ఖుషీ ఇచ్చే అవకాశం దక్కిందని టాలీవుడ్ ప్రచారం జరుగుతోంది. యాక్షన్ కింగ్ విశ్వక్ సేన్ కోసం ఓ మంచి వినూత్న పాత్రతో కథను సిద్ధం చేశాడంట. ఆ కథను విశ్వక్ సేన్ కు వినిపించగా అతనికి కూడా బాగా నచ్చినట్లు తప్పకుండా చేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ మూవీలో హీరోయిన్ గా అర్జున్ కుమార్తె నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మరోసారి స్టేజీ మీద సుధీర్ లవ్ బ్రేకప్ స్టోరీ.. కన్నీళ్లు పెట్టించాడు!అర్జున్ కుమార్తె ఇప్పటికే తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ, ఆశించినంత గుర్తింపు, అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఇప్పుడు కుమార్తెను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు అర్జున్ స్వయంగా కథను సిద్ధం చేసి సినిమాకి డైరెక్టర్ గా కూడా వ్యవహరించనున్నట్లు సమాచారం. విశ్వక్ మొదటినుంచి ఎంతో విభిన్న, నటనకు ప్రాధాన్యముండే పాత్రలే చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగానే పూర్తి భిన్నమైన పాత్రను అర్జున్ రెడీ చేశాడని తెలుస్తోంది. వెల్లిపోమాకే నుంచి అశోక వనంలో అర్జున కల్యాణం వరకు విశ్వక్ సేన్ ప్రతి పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుంది.
ఇంక విశ్వక్ సేన్ సినిమాల విషయానికి వస్తే.. 2022 క్యాలెండర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడనే చెప్పాలి. అఘోరాగా నటించిన గామీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఓ మై గాడ్ మూవీ రీమేక్ తెరకెక్కుతున్న ఓరి దేవుడా సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే చిత్రంలో క్యామియో అప్పియరెన్స్ ఇస్తున్నాడు. దాస్ కా దమ్కీ అనే చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా, డైరెక్షన్ కూడా విశ్వక్ చేస్తున్నాడు. ఇంక ముఖచిత్రం అనే మూవీలో లాయర్ క్యామియో అప్పియరెన్స్ ఇస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఎంతో అలరించింది. అర్జున్ డైరెక్షన్‌లో విశ్వక్ సేన్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గెటౌట్ అంటూ దేవి నాగవల్లిపై నరేష్ స్కిట్.. అనిల్ రావిపూడి రియాక్షన్ వైరల్!
ఇదీ చదవండి: డ్రీమ్ కారు కొన్న విశ్వక్ సేన్.. ధర ఎన్ని కోట్లంటే..!