Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరొందిన స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’. వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను.. తెలుగులో మెగాస్టర్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఆగష్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రప్రమోషన్స్ ముమ్మరం చేశారు ఆమిర్ ఖాన్ టీమ్. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో మీడియా సమావేశం జరిగింది.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఆమిర్ ఖాన్ తెలుగు సినిమాల గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం. అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీనటులుగా అద్వైత్ చందన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో నాగ చైతన్య బాలరాజు పాత్రలో సైనికుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇదివరకు తెలుగు డబ్బింగ్ సినిమాలకు తక్కువ మార్కెట్ ఉండేది. అయితే.. ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే తెలుగులో మా సినిమాను రిలీజ్ చెయ్యడానికి చిరంజీవిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సల్మాన్ ఖాన్ చిత్రంలో చిరంజీవి నటిస్తున్నాడు. చిరంజీవి నాకు కూడా అవకాశం ఇస్తే నేను తనతో నటించడానికి సిద్ధంగా ఉన్నానని’ తెలిపారు. ఆ విధంగా తన మనసులో మాటను బయటపెట్టాడు ఆమిర్. మరి ఆమిర్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.