Aamir Khan: ‘ ఇండియాలో భద్రత లేదు. నాకు ఇండియాలో ఉండాలనిపించటం లేదు’.. 2015 సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలివి. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆమీర్ ఆ వ్యాఖ్యలు చేసి దాదాపు ఏడేళ్లయింది. అయినా ఆ వ్యాఖ్యల తాలూకా ప్రభావం మాత్రం తగ్గటం లేదు. దానిపై ట్విటర్ వేదికగా మరో సారి రచ్చ జరుగుతోంది. ఆమీర్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ను బాయ్‌కాట్ చేయాలంటూ ట్విటర్లో ఓ ట్రెండ్ నడుస్తోంది.
లాల్ సింగ్ చద్దాను బాయ్ కాట్ చేయాలంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమీర్ స్పందించారు. తన సినిమాను బాయ్‌కాట్ చేయోద్దని విజ్ఞప్తి చేశారు. తాను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని అన్నారు. తాజాగా బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దాపై ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అవును! అది నాకెంతో బాధ కలిగిస్తోంది.
ఈ కామెంట్లు చేసే వారు నేను ఇండియాను ప్రేమించటం లేదని గట్టిగా విశ్వసిస్తున్నారు. కానీ, అది నిజం కాదు. ఇలా వాళ్లు అనుకోవటం దురదృష్టకరం. దయచేసి నా సినిమాను బాయ్ కాట్ చేయకండి. సినిమా చూడండి’ అని అన్నారు. మరి, బాయ్‌కాట్ ‘లాల్ సింగ్ చద్దా’పై ఆమీర్ స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బిగ్ బ్రేకింగ్: యన్టీఆర్ కుటుంబంలో విషాదం.. చిన్నకూతురు ఉమా మహేశ్వరి కన్నుమూత!