హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ లో ఓ యంగ్ ప్రొడ్యూసర్ తో లవ్ లో ఉంది. ఈ విషయం చాలామందికి తెలుసు. ఓ విషయమై స్పందిస్తూ.. రకుల్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది. ఈ న్యూస్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
తెలుగులోకి చాలామంది హీరోయిన్లు వచ్చి వెళ్తుంటారు. అందులో చాలా తక్కువమంది మాత్రమే స్టార్ హోదా అందుకుంటారు. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఓ పదేళ్ల క్రితం టాలీవుడ్ లోని దాదాపు చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈమె.. ప్రస్తుతం హిందీలో మూవీస్ చేస్తూ బిజీగా మారిపోయింది. మరోవైపు ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో లవ్ లో ఉంది. ఈ విషయం చాలారోజుల క్రితమే ఆమె చెప్పేసింది. ఎక్కడికెళ్లినా సరే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ల పెళ్లి ఎవరికీ చెప్పకుండా చేసేసుకున్నారని వార్తలొస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సెలబ్రిటీలు తమ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. రీసెంట్ గా క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యలు తమ తమ పెళ్లిని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఈ మధ్య హీరోయిన్ కియారా అడ్వాణీ సైతం తను ఎప్పటినుంచో రిలేషన్ లో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది. ఇలా అందరూ చెప్పి చేసుకుంటుంటే.. రకుల్ మాత్రం సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందని అంటున్నారు. ఇప్పుడు దీనిపై మాట్లాడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఆల్రెడీ ఆ రోజే జరిగిపోయిందంటూ చెప్పుకొచ్చింది.
‘నా పెళ్లి గురించి ప్రతివారం ఏదో ఓ వార్త వస్తూనే ఉంది. దాని ప్రకారం నేను గతేడాది నవంబరులోనే పెళ్లి చేసుకున్నాను. ఇంతకీ మా పెళ్లి ఎలా జరిగిందో చెప్పనేలేదు? ప్రస్తుతానికి మా బిజీలో మేమున్నాం. పని గురించి తప్ప మాకు వేరే ధ్యాస లేదు’ అని రకుల్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తుంటే.. ఇప్పట్లో రకుల్ పెళ్లి చేసుకోదనిపిస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో గుర్తింపు తెచ్చుకున్న రకుల్.. తెలుగులో చివరగా ‘కొండపొలం’లో కనిపించింది. మరి రకుల్ తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.