బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ కి తీవ్రమైన గుండెనొప్పి రావండంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆక ముంబాయిలోని అమీర్ ఖాన్ గృహం పంచగనిలో ఆమె దీపావళి వేడుకలో పాల్గొన్నారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్న ఆమెకు ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో అమీర్ ఖాన్ అక్కడే ఉండటంతో ఆమెను వెంటనే బ్రిచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించి అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం జీనత్ హుస్సేన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నారని.. చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్యులు తెలియజేసినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. హాస్పిటల్ లో చేర్పించినప్పటి నుంచి అమీర్ ఖాన్ అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమీర్ ఖాన్ తన చిన్నప్పటి నుంచి తల్లి జీనత్ హుస్సేన్ తో ఎంతో అనుబంధం ఉండేదని.. తాను నటించిన ప్రతి సినిమా ఆమెకు చూపించి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకొని దాని రిజల్ట్ ఎలా ఉండబోతుందో ముందే ఊహిస్తానని తెలిపారు. లాల్ సింగ్ చద్దా సినిమా విషయంలో కూడా ఆమె అభిప్రాయం అడిగి తెలుసుకున్నారట.
ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ అని అమీర్ ఖాన్ ని అంటారు.. కానీ అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగా హాట్ టాపిక్ గా మారుతుంటాయి. బాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అమీర్ ఖాన్ ఇటీవల ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో మొదటిసారిగా అక్కినేని నాగ చైతన్య నటించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. లాల్ సింగ్ చద్దా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.