కమెడియన్ యాదమ్మ రాజు అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెపై వచ్చిన పటాస్ కామెడీ షో ద్వారా పరిచయం అయిన యాదమ్మ రాజు తర్వాత పలు కామెడీ షోల్లో పాల్గొంటూ వస్తున్నారు. తన కామెడీ టైమింగ్, పంచ్ డైాలాగ్స్ తో కడుపుబ్బా నవ్విస్తాడు.
తెలుగు బుల్లితెరపై వచ్చిన ‘పటాస్’ అనే కామెడీ షో ద్వారా పరిచయమైన నటుడు యాదమ్మ రాజు. తర్వాత జీ తెలుగు ఛానల్ లో ‘అదిరింది’ అనే కామెడీ షోలో గల్లీ బాయ్స్ అనే టీమ్ ద్వారా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు. అమాయకంగా నటిస్తూనే పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు యాదమ్మ రాజు. అంతేకాదు జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో తన కామెడితో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ మంచి కమెడియన్ గా కొనసాగుతున్నాడు. తాజాగా యాదమ్మ రాజు ఆసుపత్రిలో కాలు గాయంతో కనిపించడంతో అందరూ షాక్ తిన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో స్వయంగా యాదమ్మ రాజు ఇన్‌స్ట్రాగామ్ లో పోస్టు చేయడంతో ఏం జరిగిందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో కామెడీ షోలు వచ్చాయి. అందులో జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ తర్వాత పటాస్ ప్రోగ్రామ్ బాగా అలరించింది. పటాస్ షో ద్వారా పరిచయం అయిన ఎంతోమంది ప్రస్తుతం స్టార్ కమెడియన్లుగా కొనసాగుతున్నారు. పటాస్ షో ద్వారా తనదైన కామెడీతో అందరినీ అలరించాడు యాదమ్మ రాజు. తెలంగాణ యాస మాట్లాడుతూ.. పంచ్ డైలాగ్స్ తో అందరినీ తెగ నవ్వించేవాడు. బుల్లితెరపైనే కాదు..వెండి తెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం జబర్ధస్త్ లో సద్దాంతో కలిసి టీమ్ లీడర్ గా చేస్తున్నాడు. ప్రతి వారం తన స్కిట్స్ తో అలరించే యాదమ్మ రాజు అకస్మాత్తుగా పాదాలకు కట్టుతో కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అసలు యాదమ్మ రాజు కి ఏం జరిగిందని అందరూ షాక్ తిన్నారు.
యాదమ్మ రాజ్ షేర్ చేసిన వీడియలో పాదాలకు పెద్దగా కట్టు కట్టి ఉంది. మంచంపై నుంచి మెల్లిగా కాలు కిందకు పెట్టాడు. ఆ సమయంలో భార్య స్టెల్లా అతడికి తోడుగా ఉంది. ఈ మద్య కాలంలో ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇంట్లో ఎక్కడైనా జారి పడ్డాడా? అనేది తెలియాల్సి ఉంది. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ‘యదలో ఒదిగే యదనే’ అనే పాట వస్తుంది. ఈ వీడియోని స్వయంగా యాదమ్మ రాజు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే తనకు ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. ఒకవేళ యూట్యూబ్ వేదికగా తనకు ఏం జరిగింది అన్న విషయాన్ని బయటపెడతాడేమో చూడాలి. య్యూటూబర్ స్టెల్లా రాజ్ ని గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.