బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్ల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కొంత మంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వకపోయినా సెలబ్రిటీలుగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా ఆ కోవకు చెందిన ఆవిడే. ఈ అమ్మడు హీరోయిన్ కాలేదు.. కానీ అంత కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. కారణం ఏదైనా ఆమె మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అందాల ఆరబోత దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వరకు ఐరా అన్నింటిలోనూ ఓపెన్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంది.
కొన్నిసార్లు ఆ ఫోటోలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బర్త్ డేని బికినీలో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఐరా ఖాన్ బికినీలో తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంది. తండ్రితో కలిసి కేక్ కట్ చేయడం, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం ఇలా ఆ రోజు తన బెస్ట్ మూమెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత ఫొటోల విషయంలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఎవరైనా బికినీలో బర్త్ డే చేసుకుంటారా? తండ్రి పక్కనే ఉండగా బికినీలో కేక్ కట్ చేస్తావా అంటూ పెద్ద ఎత్తున ప్రశ్నించారు. అయితే అలాంటి ట్రోలర్స్ పోస్టుల విషయంలో ఐరా స్పందించింది.
ఇదీ చదవండి: యాంకర్ అనసూయ ఫ్యామిలీ ట్రిప్.. ఫొటోస్ వైరల్!
బర్త్ డే రోజు ఫొటోలు షేర్ చేసిన తర్వాత జరిగిన ట్రోలింగ్ మొత్తం చూసి ఐరా ఖాన్ తనదైనశైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏ ఫొటోలనైతే ట్రోల్ చేశారో తర్వాత మళ్లీ అదే బర్త్ డే పార్టీకి సంబంధించిన ఇంకొన్ని ఫొటోలను ఐరా ఖాన్ షేర్ చేసింది. అంతేకాకుండా ఆ పోస్టుకు కౌంటర్ మెసేజ్ కూడా యాడ్ చేసింది. ‘ఇప్పటివరకు ఎవరైతే నా బర్త్ డే ఫొటోలను ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ ఉన్నారో వారి కోసం మరికొన్ని ఫొటోలు’ అంటూ ఐరా ఖాన్ ఫ్రెండ్స్ తో బికినీలో దిగిన ఇంకొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈసారి పోస్టుకు ట్రోలింగ్ కాకుండా ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. ట్రోలర్స్ విషయంలో ఐరా ఖాన్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.