సినిమా వాళ్ళ పెళ్లిళ్లు మూడు నాళ్ళ ముచ్చటే అన్న ఓ అపవాదు చాలా కాలంగా ఉంది. కానీ.., ఈ రంగుల లోకంలో షష్ఠి పూర్తి చేసుకున్న ఆదర్శ దంపతులు కూడా చాలా మందే ఉన్నారు. ఇక.. సుదీర్ఘ కాలం కలసి ప్రయాణిస్తూ.. పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా తోడ్పాటు అందించుకుంటున్న జంటలు కూడా ఎన్నో. ఈ లిస్ట్ లో ముందుగా వినిపించే జంట అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు. 15 ఏళ్ళ క్రితం వివాహ బంధంతో ఒక్కటై.. బాలీవుడ్ బ్యూటీ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు వీరు. కానీ.., ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ.., విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని అమీర్ స్వయంగా ప్రకటించడం విశేషం.
“15 సంవత్సరాలు మధురంగా గడిచాయి, ఒకరిపై ఒకరం నమ్మకం తో ప్రేమతో గౌరవంతో ఉన్నాము. కానీ కొత్త అధ్యాయంను ఇప్పుడు మా జీవితాల్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. ఇక పై భార్యాభర్తలం కాదు… పిల్లలకు మాత్రం కో పేరెంట్స్ గా ఉండబోతున్నాము అంటూ ఓ లెటర్ రిలీజ్ చేశారు అమీర్ దంపతులు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమిర్ మొదట రీనా దత్తాని వివాహం ఆడాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత విడిపోయారు. ఆ తరువాత అమిర్ ఫిల్మ్ డైరెక్టర్ కిరణ్ రావుని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఆజాద్ రావ్ ఖాన్ అనే బాబు ఉన్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకునే అమిర్ నుండి ఇలాంటి ప్రకటన రావడంతో ఫ్యాన్స్ షాక్ కి గురి అవుతున్నారు. కాగా.., వీరి విడాకులకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.