సాధారణంగా భార్యభర్తల మధ్య గొడవలొచ్చి విడాకులు తీసుకుంటే.. మళ్లీ కలవడం సంగతి అటుంచితే, మాట్లాడుకోవడం అనేది చాలా కష్టం. ఇది మనలాంటి ప్రజల విషయంలో జరుగుతుంది. కానీ సెలబ్రిటీల సంగతికొస్తే మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. టాలీవుడ్ సంగతి ఏమో కానీ నార్త్ హీరో లేదంటే హీరోయిన్లు మాత్రం.. విడాకుల తీసుకున్నా సరే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. అంతే కానీ కలిసి పూజాలు చేసే సందర్భాలు మాత్రం చాలా అరుదు. కానీ ఇప్పుడు అలాంటిదే జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ని అభిమానులు మిస్టర్ ఫెర్ఫెక్ట్ అని ముద్దుగా పిలుస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయన.. ప్రేక్షకుల్ని ఇన్ స్పైర్ కలిగించే స్టోరీలతో మూవీస్ చేస్తుంటారు. అలా వచ్చినవే లగాన్, రంగ్ దే బసంతి, త్రీ ఇడియట్స్, తారే జమీన్ పర్, పీకే, దంగల్. ఇక ఈ ఏడాది ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో ఆడియెన్స్ ని పలకరించిన ఆయన.. హిట్ కొట్టడంలో ఫెయిలయ్యారు. దీంతో కొన్నాళ్ల పాటు నటన, సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇది జరిగిన దగ్గర నుంచి ఆమిర్ గురించి ఒక్కరు కూడా మాట్లాడుకోలేదు. తాజాగా మాత్రం తన మాజీ భార్యతో కలిసి పూజ చేస్తూ కనిపించారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి ముస్లిం అయిన ఆమిర్ ఖాన్.. హిందూ ఆచారల ప్రకారం తన ఆఫీసులో కలశ పూజా చేశాడు. ఇక హారతి నివేదనలో ఆమిర్ మాజీ భార్య కిరణ్ రావ్ కూడా పాల్గొంది. ఈ పూజా కార్యక్రమానికి ఆఫీస్ సిబ్బందితో పాటు ‘లాల్ సింగ్ చద్దా’ డైరెక్టర్ అద్వైత్ చందన్ కూడా హాజరయ్యాడు. అమిర్ ఫొటోలను ఆయనే తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. వీటిలో తలపై నెహ్రూ క్యాప్ పెట్టుకుని, భుజాల చుట్టూ కండువాతో ఆమిర్ కనిపించారు. ఈ పూజ ఎందుకు చేశారనేది తెలియనప్పటికీ.. ఆమిర్ ఖాన్ ఆఫీస్ మాత్రం కలర్ ఫుల్ గా కనిపించింది. ఇక ఈ ఫొటోలపై స్పందించిన పలువురు నెటిజన్స్.. ఆమిర్ ని ఇలా చూసి ఆశ్చర్యపోయామని, హార్ట్ టచింగ్ మూమెంట్స్ అని మాట్లాడుకుంటున్నారు.