కేజీఎఫ్ చాప్టర్ 2.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటి అటనుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ కి, అత్యద్భుతమైన ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, విజన్ కి సినీఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాలోని ప్రధాన నటుల నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
కేజీఎఫ్-2 మూవీకి సంబంధించి యాక్టర్స్ తో పాటు టెక్నీషియన్స్ కూడా మంచి పేరు, గుర్తింపు దక్కించుకున్నారు. వారిలో ఒకరు ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి. ఈ సినిమా కోసం తనలోని అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి.. ఎడిటర్ గా సినిమా చూసిన ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా చేశాడు. కేవలం 19 ఏళ్ళ వయస్సు కలిగిన ఉజ్వల్.. ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూసిన కేజీఎఫ్-2 మూవీని ఎడిట్ చేసాడంటే మామూలు విషయం.
ప్రస్తుతం ఈ యంగ్ టాలెంటెడ్ ఎడిటర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మరి కేజీఎఫ్-2 సినిమానే ఉజ్వల్ చేతిలో పెట్టారంటే.. అసలు ఉజ్వల్ ఇదివరకు ఏయే సినిమాలు చేశాడు? కేజీఎఫ్ మూవీకి ఎలా అవకాశం ఇచ్చారు? దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఉజ్వల్ లో ఏం చూసి మూవీ అతని చేతిలో పెట్టాడు? అంటే.. వయస్సుతో సంబంధం లేకుండా ఉజ్వల్ లోని హై లెవెల్ టెక్నికల్ టాలెంట్ చూసి అవకాశం ఇచ్చారని అని ఇండస్ట్రీ చెబుతోంది.
ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి.. యూట్యూబ్ కోసం షార్ట్ ఫిలిమ్స్, బ్లాక్ బస్టర్ సినిమాలకు ఫ్యాన్ ఎడిట్స్, కట్స్ ఎడిట్ చేసేవాడు. ఉజ్వల్ చేసిన షార్ట్ ఫిలిమ్స్, ఫ్యాన్ ఎడిట్స్ చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంప్రెస్ అయ్యాడు. ఆ వెంటనే కేజీఎఫ్-2 సినిమా తీసుకెళ్లి ఉజ్వల్ చేతిలో పెట్టేశాడు. అంతే.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎడిటర్ గా ఉజ్వల్ కేజీఎఫ్ మూవీని మరోస్థాయికి తీసుకెళ్లాడు.. ఇప్పుడు అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు ఉజ్వల్ వర్క్ ని కొనియాడుతున్నారు.
కేజీఎఫ్-2 కోసం ఎడిటర్ గా ఉజ్వల్ చేసిన కట్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సాధారణంగా కేజీఎఫ్ లాంటి సినిమా అనేది ఎడిటర్లకు అగ్నిపరీక్ష లాంటిది. ఏకకాలంలో డిఫెరెంట్ స్క్రీన్ ప్లే వేరియేషన్స్ చూపించాల్సి ఉంటుంది. కానీ ఉజ్వల్ ఈ సినిమాకు ఎడిటర్ గా వందశాతం న్యాయం చేశాడు. ఉజ్వల్ పనితనానికి ఇప్పుడు మేకర్స్, ఫ్యాన్స్ విజిల్స్ వేసి.. క్లాప్స్ కొట్టి అభినందిస్తున్నారు. ఎడిటర్ గా డెబ్యూ మూవీకే పాన్ ఇండియా స్టార్డమ్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఉజ్వల్. మరి ఉజ్వల్ టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.