గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాపై వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు.. వివాదాలకు దారి తీశాయి. ఇండస్ట్రీలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఎలాంటి విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సినిమాలు తీసిన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఏం సాధించాడని అంటే..
గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాపై వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు.. వివాదాలకు దారి తీశాయి. ఇండస్ట్రీలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఎలాంటి విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లమంది కేజీఎఫ్ సిరీస్ కి డైహార్డ్ ఫ్యాన్స్ గా ఉన్నారు. అలాంటి సినిమాపై ‘నీచ్ కమిన్ కుత్తే..’, ‘ఆడమ్మా బాబు లాంటి సినిమాలు’ అంటూ తీవ్రవిమర్శలు చేసి చర్చల్లో నిలిచాడు వెంకటేష్. మరి వెంకటేష్ మహా.. కామెంట్స్ చేసిన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఏం సాధించాడని అంటే..
విజయం ఎప్పుడైనా మధురమే. కానీ.., కొన్ని విజయాలు మాత్రం ఆనందంతో పాటు.. ఆశ్చర్యాన్ని కూడా తీసుకొస్తాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కె.జి.యఫ్ ఫ్రాంఛైజీది కూడా ఇలాంటి విజయమే. అప్పటి వరకు ఇండియన్ సినిమా చూడని ఓ సరికొత్త మేకింగ్ తో కె.జి.యఫ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గుండెలు పగిలేలా అరవాలి అనిపించే మాస్ ఎలివేషన్స్, హృదయాన్ని తడి చేసే సెంటిమెంట్.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎదిరించి, తానే ప్రపంచాన్ని శాసించేలా ఎదిగే హీరో క్యారెక్టరైజేషన్ వీటితో పాటు, సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత అవసరమో, ఎడిటింగ్ ఎక్కడ అవసరమో అనే పాఠాలు నేర్పిస్తూ.. కె.జి.యఫ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది. కట్ చేస్తే.. 4 ఏళ్ళ తరువాత వచ్చిన కె.జి.యఫ్-2 ఇప్పుడు అంతకుమించిన సక్సెస్ అందుకుంది. ఒక్కసారి వస్తే అది విజయం. కానీ.., ఆ విజయం ప్రతిసారి వస్తే అది అద్భుతం. ఇంత అద్భుతానికి కారణమైన వ్యక్తి పేరు ప్రశాంత్ నీల్.
ఎవరీ ప్రశాంత్ నీల్? ఒక్క మాటలో సమాధానం చెప్పడానికి అతని ప్రస్థానం సాధారణమైనది ఏమి కాదు. అలా అని 100 సినిమాల ప్రయాణము కాదు. ఇప్పటి వరకు తీసింది మూడే మూడు సినిమాలు. కానీ.., “అతని సినిమాల సంఖ్య చిన్నదే అయినా.. అతను అడుగు పెట్టాక కన్నడ సినీ ఇండస్ట్రీ మార్కెట్ పెద్దది అయ్యింది”.కర్ణాటక రాష్ట్రంలోని హసన్ ప్రాంతం ఇప్పుడు చాలా ఫేమస్. కె.జి.యఫ్ లోలా అక్కడ బంగారం దొరకదు. కానీ.. కె.జి.యఫ్ తెరకెక్కించిన దర్శక బంగారం ప్రశాంత్ నీల్ పుట్టింది అక్కడే. చిన్నప్పటి నుండి ప్రశాంత్ నీల్ దర్శకుడిని అయిపోవాలని కలలు కనలేదు. సినిమాలు అంటే పడి చచ్చేరకం అంతకన్నా కాదు. బుద్దిగా చదువుకున్నాడు.
“అంతా డబ్బు ఉంటే హాయిగా బతకొచ్చు అనుకుంటారు. కానీ.., డబ్బు లేకుంటే చావు కూడా ప్రశాంతంగా అవ్వదు” అని ప్రశాంత్ నీల్ అప్పుడే ఆలోచించాడు. అందుకే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే సినిమాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆ ఆసక్తితోనే ఫారిన్ లో డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నాడు. అలా.. కన్నడ సినీ ఇండస్ట్రీ వైపు బయలు దేరాడు. ఆ సమయంలో “అతనికి వెళ్లే దారి గురించి తెలియదు. కాలం తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. కన్నడ సినీ ఇండస్ట్రీ మార్కెట్ ఎంత చిన్నదో కూడా తెలియదు”.
అలా 2014లో తన బావమరిది శ్రీమురళీ హీరోగా ‘ఉగ్రమ్’ అనే సినిమాని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. “నేను రెడీ అంటూ”.. కన్నడ ఇండస్ట్రీకి తన రాకని తెలియజేయడానికి ప్రశాంత్ నీల్ సిద్ధంగా ఉన్న క్షణం అది. కానీ.., అడుగు దూరంలో లక్ష్యం ఉందనగా చుట్టూ చీకట్లు కమ్మాయి. సినిమా అంతా తీశాక.. విడుదలకి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అయితే.., అప్పటికే ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ స్టయిల్ గురించి కన్నడ ఇండస్ట్రీలో వార్తలు దావాలంలా వ్యాపించాయి. దీంతో.. నీల్ పై నమ్మకంతో కన్నడ స్టార్ హీరో దర్శన్.. ‘ఉగ్రమ్’ మూవీ విడుదలకి సహాయం చేశాడు. అలా అన్నీ సమస్యలను దాటుకుని 2014 ఫిబ్రవరి 21న ‘ఉగ్రమ్’ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. “విధి చేతి వాటం.. ఉగ్రమ్ విడుదలైన రోజు రెండు సంఘటనలు జరిగాయి. దర్శకుడిగాప్రశాంత్ నీల్ పుట్టాడు. అతని రాకతో కన్నడ సినీ ఇండస్ట్రీ మళ్ళీ కొత్తగా పుట్టింది”!
“ఊరు చూడటానికి వచ్చినోడు ఊరి గురించి తెలుసుకుంటాడు. ఊరిని ఏలటానికి వచ్చినోడు తన గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు”. ‘ఉగ్రమ్’ మూవీతో ప్రశాంత్ నీల్ అదే చేశాడు. తన గురించి కన్నడ ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన గురించి కన్నడ ఇండస్ట్రీ మాట్లాడుకునేలా చేశాడు. కొద్దిరోజులు కన్నడ బాక్సాఫీస్ వద్ద ‘ఉగ్రమ్’ జాతర జరిగింది. కేవలం తన రాకని తెలియజేయడానికి ప్రశాంత్ నీల్ తీసిన సినిమాని జనాలు విజిల్స్ వేసి హిట్ చేశారు. కానీ..,ఎప్పుడైతే శాంపిల్ గా తీసిన ‘ఉగ్రమ్’ మూవీ సూపర్ హిట్ అయ్యిందో.. అప్పుడే ప్రశాంత్ నీల్ కి కన్నడ ఇండస్ట్రీ ఓ చెరువు లా కనిపించింది. తనకి కావాల్సిన సముద్రాన్ని అందుకోవాలంటే ముంబైలో అడుగు పెట్టాలని ఆ క్షణమే అర్ధం చేసుకున్నాడు.
“పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్”.. ప్రశాంత్ నీల్ ఈ సౌండింగ్ ముంబైకి వినిపించేలా చేయాలి అనుకున్నాడు. అలా జరగాలంటే.. ఓ మంచి కథ కావాలి. ఆ కథ గొప్పగా ఉండాలి. కానీ.., తొందర పడితే గొప్ప కథలు రాయలేరు. అలా అని ప్లాన్ చేసి గొప్ప కథలను బ్లూ ప్రింట్ తీయలేరు. దానికి కావాల్సినదల్లా ఓ చిన్న ఆలోచన. అయితే.., ఆరోజు ప్రశాంత్ నీల్ మెదడులో ఓ కారుచిచ్చే అంటుకుంది. ఆ విస్ఫోటనం పేరు “కె.జి.యఫ్”!
కె.జి.యఫ్ అంటే.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. దక్షిణ కోలార్ జిల్లా హెడ్ క్వార్టర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రాబర్ట్ సన్ పేట తాలూకాలో ఈ గనులున్నాయి. ఈ గనుల వెనుక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రశాంత్ నీల్ ఆ చరిత్ర కథలను వింటూనే పెరిగాడు. అంతటి గొప్ప ప్రాంతం చుట్టూ కథ అల్లుతూ.. గొప్ప పాత్రలకి ప్రాణం పోశాడు. తనకి కావాల్సిన కథ సిద్ధమైంది. అప్పుడప్పుడే కన్నడ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న యష్ ను కె.జి.యఫ్ లో హీరోగా ఫైనల్ చేసుకున్నాడు. 2018 నాటికి కన్నడ సినీ ఇండస్ట్రీ హయ్యెస్ట్ గ్రాసర్ కేవలం 75 కోట్లు మాత్రమే. అలాంటిది కె.జి.యఫ్ మూవీ కోసం 80 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలి. సినిమాని రూపాయల్లో కాకుండా.. మనసుతో, ప్రేమతో, ఇష్టంతో నిర్మించే నిర్మాత తప్ప ఇంకెవ్వరు ఈ సాహసం చేయలేరు. అలాంటి సమయంలో.. హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిర్గందూర్ ముందుకి వచ్చారు. కానీ.., అప్పుడు కేజీఎఫ్ టీమ్ ని చూసి అంతా నవ్వుకున్నారు. అయితే.. ఆ క్షణాన కన్నడ సినీ ఇండస్ట్రీలో ఇద్దరే ఇద్దరు బలంగా నిలబడి ఉన్నారు. ఒకరు ప్రశాంత్ నీల్. మరొకరు అతని విజన్ ని నమ్మిన యష్.
కె.జి.యఫ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్రమోషన్ కావాలి. తమ వాయిస్ ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి, తమ సినిమా స్థాయిని అర్ధమయ్యేలా అందరికి చెప్పడానికి ఓ బలమైన గొంతు కావాలి. సరిగ్గా.. అలాంటి సమయంలో బాహుబలితో సౌత్ ఇండియా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పి, బాలీవుడ్ మేకర్స్ కు ఓ చిక్కు ప్రశ్నలా మారాడు రాజమౌళి. కె.జి.యఫ్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి రాజమౌళినే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు ప్రశాంత్ నీల్, యష్. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఓరోజు రాజమౌళి ఎయిర్ పోర్ట్ లో వీరికి ఎదురు పడ్డాడు. యష్ ఆత్రుతుగా వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ మాటలు రాజమౌళి చెవులకి ఎక్కడం లేదు. ప్రశాంత్ నీల్ గురించి యష్ గొప్పగా చెప్తున్నాడు. రాజమౌళికి అవేమి వినే టైమ్ లేదు. సర్..మాది పాన్ ఇండియా మూవీ అన్నాడు యష్. అక్కడ ఆగిపోయాడు రాజమౌళి. జక్కన్నకి కావాల్సింది కూడా అదే. సౌత్ ఇండియన్ సినిమా బౌండరీస్ ని బద్దలు కొట్టాలి. నార్త్ డామినేషన్ ని పటాపంచలు చేయాలి. అదే రాజమౌలి కోరిక. ఆ కారణంగా కె.జి.యఫ్ విజువల్స్ చూడటానికి ఒప్పుకున్నాడు రాజమౌళి.
15 నిమిషాల సమయం. ల్యాప్ టాప్ లో కె.జి.యఫ్ యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తూ నీల్ ఏదో చెప్తున్నాడు. రాజమౌళికి ఆ మాటలు వినపడటం లేదు. అసలు ఆ మాటలు వినే స్థితిలో కూడా జక్కన్న లేదు. ఆ విజువల్స్ రాజమౌళిని బంధించేశాయి. అతను ఈ లోకంలో లేడు. అలానే ఆ యాక్షన్ సీక్వెన్స్ చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తున్న క్షణంలోనే రాజమౌళికి అర్ధమైంది. కె.జి.యఫ్ అంటే బంగారం దొరికే స్థలం మాత్రమే కాదు. బంగారం లాంటి సినిమా కూడా అని. ఆ క్షణాన రాజమౌళి.. యష్ కోసమో, అక్కడ ఉన్న ప్రశాంత్ నీల్ కోసమో, తన ఆశయం కోసమో తెలియదు గాని.. కె.జి.యఫ్ ను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను వెళ్లిన ప్రతి చోటా కె.జి.యఫ్ గురించి గొప్పగా చెప్పడం మొదలు పెట్టాడు రాజమౌళి.
అలా.., 2018 డిశంబర్ 21న కె.జి.యఫ్ ప్రేక్షుకుల ముందకు వచ్చింది. సినిమా చూసిన వారంతా మౌనంగా ఉండిపోయారు. అద్భుతాన్ని ఆస్వాదించే సమయంలో మనిషిలో ఆవహించే ఓ నిశబ్ధత అది. తొలి వారం తరువాత అన్నీ వర్గాల ప్రేక్షకులకి కె.జి.యఫ్ స్థాయి అర్ధమైపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా కె.జి.యఫ్ ప్రభంజనం సృష్టించింది. అంతా.. కె.జి.యఫ్ మ్యానియా. అంతా కె.జి.యఫ్ మాయ. అంతలా కె.జి.యఫ్ సూపర్ హిట్ అయ్యింది. కన్నడ సినీ ఇండస్ట్రీ కలలో కూడా ఊహించని రేంజ్ లో కె.జి.యఫ్ చాప్టర్-1 రూ.250 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆ క్షణాన ప్రశాంత్ నీల్ ఇండియన్ సినీ మార్కెట్ లో.. సర్వము తననుకునే బాలీవుడ్ ని ప్రశ్నించి.. పిడుగులా గర్జించే ఒక ధీరుడులా కనిపించాడు.
జీవితంలో ఎదగడం కన్నా.. వచ్చిన ఎదుగుదలను నిలబెట్టుకోవడం కష్టం. కె.జి.యఫ్-1 తరువాత కె.జి.యఫ్-2 హిట్ కొట్టాలి. లేదంటే ఈ సక్సెస్ అంతా గాలివాటం అని చాలా మంది పెదవి విరుస్తారు. ఇందుకోసం 4 ఏళ్ళు కష్టపడ్డాడు ప్రశాంత్ నీల్. మధ్యలో ఎన్నోసార్లు సినిమా ఆగిపోయింది. కోవిడ్ కష్టాలు చుట్టుముట్టాయి. కానీ.., ఎన్ని అవరోధాలు వచ్చినా కె.జి.యఫ్ చాప్టర్ 2 కంప్లీట్ చేశాడు నీల్. విడుదల నాటికి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 170 కోట్ల రూపాయల విలువ చేసే టికెట్స్ అడ్వాన్స్ గా బుక్ అయ్యే అంత అంచనాలు అవి. ఇన్ని అంచనాలను దాటుకుని కె.జి.యఫ్ సక్సెస్ చేయడం సాధ్యమా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ.., వారికి తెలియంది ఏమిటంటే? ప్రశాంత్ నీల్ అగ్గి లాంటోడు. ప్రేక్షకుల అంచనాలు పెట్రోల్. ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ ఉంటే నీల్ సినిమా అంత ఎక్కువ మండుతుంది. ధగ ధగ ధగ.…!
2022 ఏప్రిల్ 14న కెజిఎఫ్-2 ప్రేక్షకుల ముందుకి వచ్చి, ఇండియన్ సినిమా రికార్డ్స్ కొల్లగొడుతుంది. ఇది ప్రశాంత్ నీల్ ప్రస్థానం. అయితే.. నీల్ ప్రయాణంలో ఇదంతా మొదటి అధ్యాయం మాత్రమే. అసలు జర్నీ ఇకపై మొదలు కాబోతుంది. మొత్తంగా.. సూత్రదారుడి సూత్రాన్ని చెరిపి.. సౌత్ ఇండియా సినిమాలను చిన్న చూపు చూసే బాలీవుడ్ అహంకారాన్ని అంతం చేయడానికి వచ్చిన దొరని, ధీరులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చిన కన్నడ ఇండస్ట్రీకి హ్యాట్సాఫ్. ప్రశాంత్ నీల్ కి హ్యాట్సాఫ్.
ఇవన్నీ సాధించాడు.. కాబట్టి, తెలుగు ప్రేక్షకులు కేజీఎఫ్ సినిమాలను, ఆయన్ని అంతలా ప్రేమించారు. ఆ స్థాయిలో ఆదరించారు. ఇప్పటికీ.. తెలుగు ఆడియెన్స్ కేజీఎఫ్ అనగానే ఆ ఎమోషన్స్ ని ఫీల్ అవ్వగలుగుతారు. అలాంటి సినిమాలను, దర్శకుడిని బూతులు తిడుతూ కామెంట్స్ చేసినందుకే.. ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్.. దర్శకుడు వెంకటేష్ మహాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్రోల్ చేశారు. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పడంలో తప్పులేదు.. కానీ, సినిమాని, సినిమాని తెరకెక్కించిన దర్శకుడిని అవమానిస్తూ కామెంట్స్ చేయడం అనేది తప్పే అవుతుంది. ప్రశాంత్ నీల్ ఏం సాధించాడు అనంటే.. చెప్పుకోవడానికి పైవన్నీ ఉన్నాయి. మరి.. ప్రశాంత్ నీల్ జర్నీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is unacceptable #VenkateshMaha garu.🥲 Every film has its own story to present to the audience. But such degrading comments are not healthy for any filmmaker. #kgfchapter1 #KGFChapter2 are loved by audience in #Telugu101 #kanada pan #india pic.twitter.com/L4b0EATH9H
— Telugu 101 (@Telugu101) March 6, 2023
— Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023