యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు దిల్ రాజు చెప్పుకొచ్చారు. అది కూడా ఓ పౌరాణిక సినిమా కావడం విశేషం.
ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు పాన్ ఇండియా చిత్రాల్లో నటించడానికే ఎక్కవగా ఇష్టపడుతున్నారు. ఇక ఈ పాన్ ఇండియా సినిమా హీరోల్లో ముందు వరుసలో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఏ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాత ప్రభాస్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ పౌరాణిక సినిమాలో యంగ్ రెబల్ స్టార్ నటించబోతున్నట్లు స్టార్ ప్రొడ్యూసర్ తెలిపాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
యంగ్ రెబల్ స్టార్ కు టాలీవుడ్ లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె, ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్. ఇక ఈ సినిమాలతో పాటుగా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే హార్రర్ మూవీని కూడా పట్టాలెక్కించాడు రెబల్ స్టార్. ఇక ప్రభాస్ నుంచి ఇన్ని సినిమాలు వస్తుండటంతో.. అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఈ క్రమంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే న్యూస్ చెప్పాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ప్రభాస్ సినిమా షూటింగ్ లు అన్ని పూర్తి కాగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ పౌరణిక సినిమా చేస్తున్నట్లు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు స్పష్టం చేశారు. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా పట్టాలు ఎక్కబోతున్నట్లు దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి అని ఈ సందర్భ ఆయన చెప్పుకొచ్చాడు. మరి ప్రభాస్ పౌరాణిక సినిమా చేయడం, అది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.